Thug Life Day 2 Collections : థగ్ లైఫ్ 2వ రోజు కలెక్షన్లు.. లోకనాయకుడికి భారీ దెబ్బ.. ఎంత వసూలైందంటే?
లోకనాయకుడు కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం 'థగ్ లైఫ్'. 1987లో వరి ఇద్దరి కాంబినేషన్ లో 'నాయకుడు' అనే చిత్రం వచ్చి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ 37 ఏళ్లకు వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వడం విశేషం. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, శింబు, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు. జూన్ 5 కన్నడ మినహా.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక థగ్ లైఫ్ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 2 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే వివరాల్లోకి వెళితే..
థగ్ లైఫ్ మూవీ బడ్జెట్ (Thug Life Budget)?
రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాను నిర్మించాయి. ఈ చిత్రానికి కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ తారాగణం, టెక్నీషియన్లు, ప్రమోషన్ల కారణంగా గట్టిగానే ఖర్చైంది. మేకర్స్ మొత్తంగా రూ.220 కోట్లు ఖర్చు చేశారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

థగ్ లైఫ్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ (Thug Life Break Even Target)?
కమల్ హాసన్ -మణిరత్నం రీయూనైట్ కావడంతో థగ్ లైఫ్ సినిమాకు భారీ డిమాండ్ పెరిగింది. ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్ వరల్డ్ వైడ్ గా రూ.106 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.210 కోట్లు తిరిగి వచ్చిది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను మాత్రం రూ.250 కోట్లుగా ట్రేడ్ నిపుణులు నిర్ణయించారు.
థగ్ లైఫ్ ఓవర్సీస్ కలెక్షన్లు (Thug Life Overseas Collections)
ఓవర్సీస్ లో థగ్ లైఫ్ దుమ్ములేపుతోంది. మొదటి రోజు కమల్ హాసన్ థగ్ లైఫ్ చిత్రానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్ డే ఓవర్సీస్ లో రూ.22 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇండియాలో కంటే ఓవర్సీస్ లోనే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. సినిమాకు మిక్డ్స్ టాక్ రావడంతో మున్ముందు కలెక్షన్లు ఎలా ఉంటాయనేది చూడాలి.
థగ్ లైఫ్ 2 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు (Thug Life 2 Days Box Office Collections)
థగ్ లైఫ్ మొదటి రోజు బాక్సాఫీస్ వసూళ్లు అదిరిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని మొత్తంగా రూ.40 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. ఇండియా నెట్ 2వ రోజు వరకు రూ.23 కోట్లకు చేరుకుందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. కేవలం 2వ రోజు మాత్రమే రూ.7.5 కోట్ల ఇండియా నెట్ వసూల్ అయ్యిందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి. 2వ రోజు ఇండియా గ్రాస్ రూ.14 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇండియా గ్రాస్ మొత్తంగా రూ.32 కోట్లకు చేరుకుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
భారీ తగ్గిన వసూళ్లు.. ఆక్యుపెన్సీ
థగ్ లైఫ్ చిత్రం వసూళ్లు ఓపెనింగ్ డేతో పోల్చితే 2వ రోజు భారీగా తగ్గాయి. 40 శాతానికి వసూళ్లు పడిపోయాయి. కర్ణాటక ఎఫెక్ట్, మిక్డ్స్ టాక్ ప్రభావంతో కలెక్షన్లు తగ్గాయని తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రానికి మొదటి రోజు థియేటర్ ఆక్యుపెన్సీ 4 ఆటలకు కలిపి ఓవరాల్ గా 52 శాతం నమోదైంది. ఇక 2వ రోజు 31 శాతానికి పడిపోయింది. ఇక శని, ఆది వారాల్లో ఈ మూవీ ఎలా పెర్ఫామ్ చేస్తుందనేది వేచి చూడాలి. ఈ చిత్రాన్ని ఇండియాలో సుమారుగా 2300 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో సుమారుగా 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొత్తంగా వరల్డ్ వైడ్ 6000 స్క్రీన్లలో విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











