Thug Life Day 3 Collections : థగ్ లైఫ్ 3వ రోజు కలెక్షన్లు.. ఇంకా అక్కడే.. ఎంత వసూలైందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'థగ్ లైఫ్'. జూన్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కథానాయికగా నటించింది. కోలీవుడ్ స్టార్ శింబు కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఓ మాదిరిగానే వసూళ్లను రాబడుతోంది. ఈ క్రమంలో మూవీ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 3వ రోజు ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..
థగ్ లైఫ్ మూవీ బడ్జెట్ (Thug Life Budget)?
యాక్షన్ గ్యాంగ్ స్టర్ చిత్రం థగ్ లైఫ్ ను రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మాతలుగా ఉన్నారు. భారీ తారాగణం, టెక్నీషియన్లు, ప్రమోషన్లతో కలిపి ఈ చిత్రానికి మొత్తంగా రూ.220 కోట్లు ఖర్చు అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

థగ్ లైఫ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ (Thug Life Break Even Target)?
థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కమల్ హాసన్ 'విక్రమ్'తో భారీ హిట్ అందుకొని ఉండటం, 37 ఏళ్ల తర్వాత మణిరత్నం - కమల్ హాసన్ కాంబో సెట్ అవ్వడంతో 'థగ్ లైఫ్'కు భారీ డిమాండ్ వచ్చింది. ఇక ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.106 కోట్ల బిజినెస్ చేసింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకొని రూ.250 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫిక్స్ చేశారు. మరోవైపు ఈ చిత్రానికి కేవలం డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారానే రూ.210 కోట్ల ఆదాయం రావడం విశేషం.
థగ్ లైఫ్ ఓవర్సీస్ కలెక్షన్లు (Thug Life Overseas Collections)
ఇండియాలో కంటే ఓవర్సీస్ లోనే థగ్ లైఫ్ చిత్రం దుమ్ము లేపుతోంది. ఈ చిత్రానికి 1వ రోజు యూఎస్, యూకేలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్ డే ఓవర్సీస్ లో ఏకంగా రూ.22 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక 2వ రోజు రూ.3.70 కోట్లు, 3వ రోజు వీకెండ్ కావడంతో రూ.5 కోట్ల గ్రాస్ వరకు వసూల్ చేసి ఉంటుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో రూ.30 కోట్ల వరకు చేరుకుందని ఏర్లీ ఎస్టిమేట్ చేస్తున్నారు.
థగ్ లైఫ్ 3 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు (Thug Life 3 Days Box Office Collections)
థగ్ లైఫ్ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.40 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. ఇండియాలో రూ.18 కోట్లు గ్రాస్, ఓవర్సీస్ లో రూ.22 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక 2వ రోజు వరకు ఈ చిత్రం వసూళ్లు భారీగా తగ్గాయి. ఏకంగా 40 శాతానికి వసూళ్లు పడిపోయాయి. 22.65 కోట్ల వరకు ఇండియా నెట్, రూ.25.70 కోట్ల వరకు ఓవర్సీస్ లో వసూల్ చేసింది. రూ.26.30 కోట్ల వరకు ఇండియా గ్రాస్ వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ.52 కోట్లు వసూల్ చేసింది. ఇక 3వ రోజు రూ.7.50 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ గణంకాలు చెబుతున్నాయి. 3వ రోజు వరకు వరల్డ్ వైడ్ గా రూ.65 కోట్ల వరకు వసూళ్లు జరిగాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే కమల్ హాసన్ చిత్రం మొదటి వీకెండ్ లో చాలా స్వల్పంగా వసూళ్లు రాబడుతోంది. ఇంకా 100 కోట్ల క్లబ్ లో చేరకపోవడం ఆశ్చర్యకరంగా మారింది.


Click it and Unblock the Notifications