Thug Life Day 4 Collections : థగ్ లైఫ్ 4వ రోజు కలెక్షన్లు.. వీకెండ్ లోనూ చప్పగానే.. ఎంతంటే?

తమిళంలో రూపుదిద్దుకొని పాన్ ఇండియా స్థాయిలో రీసెంట్ గా విడుదలైన చిత్రం 'థగ్ లైఫ్'. కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్ లో ఈ చిత్రం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. జూన్ 5న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ జరిగింది. త్రిష కృష్ణన్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి కథానాయికలుగా నటించారు. శింబు కీలక పాత్ర పోషించడం విశేషం. దీంతో ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఓపెనింగ్ డేనే మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. కాగా మూవీ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 4వ రోజు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే వివరాల్లోకి వెళితే..

కమల్ హాసన్ థగ్ లైఫ్ బడ్జెట్ (Thug Life Budget)?
ఈ యాక్షన్, గ్యాంగ్ స్టర్ థగ్ లైఫ్ చిత్రాన్ని కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మించారు. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో రూపు దిద్దుకుంది. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించడం, టాప్ టెక్నీషియన్లు పనిచేయడం, భారీ ఎత్తున ప్రమోషన్ నిర్వహించడంతో ఈ చిత్రానికి మొత్తంగా రూ.220 కోట్లు ఖర్చు అయ్యిందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు.

Kamal Haasan Mani Ratnam Thug Life Movie Day 4 Box Office Collections Worldwide

థగ్ లైఫ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ (Thug Life Break Even Target)?
కమల్ హాసన్, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించడం. మణిరత్నం దర్శకత్వం వహించడం, ముఖ్యంగా 37 ఏళ్ల తర్వాత మళ్లీ కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో ఈ చిత్రం రూపుదిద్దుకొని ప్రేక్షకుల ముందుకు రావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.106 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకొని రూ.250 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫిక్స్ చేశారు ట్రేడ్ పండితులు. మరోవైపు ఈ చిత్రానికి డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ద్వారా రూ.210 కోట్లు అందాయి.

థగ్ లైఫ్ ఓవర్సీస్ కలెక్షన్లు (Thug Life Overseas Collections)
ఇండియాలో కంటే ఓవర్సీస్ లోనే థగ్ లైఫ్ చిత్రం దుమ్ము లేపుతోంది. ఈ చిత్రానికి 1వ రోజు యూఎస్, యూకేలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్ డే ఓవర్సీస్ లో ఏకంగా రూ.22 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక 2వ రోజు రూ.3.70 కోట్లు, 3వ రోజు రూ.1కోటీ మాత్రమే వసూల్ చేసిందని, దీంతో ఓవర్సీస్ మొత్తం రూ.26.70 కోట్లకు చేరుకుందని సాక్ నిల్క్ రిపోర్ట్ తెలియజేసింది. ఇక టాక్ బాలేకపోవడంతో 4వ రోజు కూడా రూ.1 కోటి మాత్రమే వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

థగ్ లైఫ్ 4 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు (Thug Life 4 Days Box Office Collections)
థగ్ లైఫ్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్ల గ్రాస్ అందుకుంది. 2వ రోజు వరల్డ్ వైడ్ గా రూ.12 కోట్లు, 3వ రోజు రూ.10.50 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక 4వ రోజు మాత్రం ఇండియా నెట్ రూ.6.50 కోట్లు వసూల్ చేసిందని సాక్ నిల్క్ లెక్కలు తెలియజేస్తున్నాయి. దీంతో వరల్డ్ వైడ్ గా రూ.13 కోట్ల గ్రాస్ వరకు వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక 4వ రోజు చిత్రానికి యావరేజ్ గా 31 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ దక్కింది. దీంతో 4వ రోజు వరకు ఈ చిత్రం రూ.75 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X