Thug Life Day 6 Collections : థగ్ లైఫ్ 6వ రోజు కలెక్షన్లు.. ఎన్ని కోట్లు వసూలైందంటే?

కోలీవుడ్ స్టార్, లోకనాయకుడు కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్ లో 'థగ్ లైఫ్' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మినహా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ జరిగింది. త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్లుగా అలరించారు. కోలీవుడ్ స్టార్ శింబు కీలక పాత్ర పోషించారు. అయితే ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను సాధించిందనేది చూద్దాం. కాగా థగ్ లైఫ్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 6వ రోజు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ వివరాల్లోకి వెళితే..

కమల్ హాసన్ థగ్ లైఫ్ బడ్జెట్ (Thug Life Budget)?
థగ్ లైఫ్ చిత్రాన్ని నిర్మించేందుకు భారీగానే ఖర్చైంది. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో రూపు దిద్దుకుంది. భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్లు, ఏఆర్ రెహమాన్ సంగీతం, పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో సినిమాను గట్టిగానే ఖర్చు అయ్యింది. మొత్తంగా రూ.220 కోట్ల వరకు వ్యయం జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

Kamal Haasan Mani Ratnam Thug Life Movie Day 6 Box Office Collections Worldwide

థగ్ లైఫ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ (Thug Life Break Even Target)?
37 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్, హీరోయిన్ గా త్రిష కృష్ణన్, కీలక పాత్రలో శింబు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీకి మంచి డిమాండ్ కూడా ఉండింది. దాంతో వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.106 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరోవైపు ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా కలుపుకొని మొత్తంగా రూ.250 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ట్రేడ్ పండింతులు నిర్ణయించారు. ఇక ఈ చిత్రానికి డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ద్వారా రూ.210 కోట్ల బిజినెస్ జరిగింది.

థగ్ లైఫ్ ఓవర్సీస్ కలెక్షన్లు (Thug Life Overseas Collections)
ఇండియాలో కంటే ఓవర్సీస్ లోనే థగ్ లైఫ్ చిత్రం దుమ్ము లేపుతోంది. ఈ చిత్రానికి 1వ రోజు యూఎస్, యూకేలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్ డే ఓవర్సీస్ లో ఏకంగా రూ.22 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక 2వ రోజు రూ.3.70 కోట్లు, 3వ రోజు రూ.1కోటీ, 4వ రోజు రూ.2.30 కోట్లు, 5వ రోజు రూ.9.30 కోట్లు వసూళ్లు చేసింది. 5రోజుల్లో ఓవర్సీస్ లో మొత్తంగా రూ.39.30 కోట్లు వసూళ్లు అందుకుంది.

థగ్ లైఫ్ 5 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు (Thug Life 5 Days Box Office Collections)
థగ్ లైఫ్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్ల గ్రాస్ అందుకుంది. 2వ రోజు వరల్డ్ వైడ్ గా రూ.12 కోట్లు, 3వ రోజు రూ.10.50 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక 4వ రూ.10.50 కోట్లు, 5వ రోజు రూ.12 కోట్లు వసూల్ చేసింది. 5వ రోజు వరకు ఈ చిత్రం ఇండియా నెట్ రూ.39.20 కోట్లు వసూల్ చేసింది. ఇండియా గ్రాస్ రూ.45.70 కోట్లు అందుకుంది. వరల్డ్ వైడ్ గా రూ.85 కోట్లు వసూళ్లు అందుకుంది.

థగ్ లైఫ్ 6వ రోజు వసూళ్లు (Thug Life Day 6 Box Office Collections)
థగ్ లైఫ్ చిత్రానికి 6వ రోజు ఇండియా నెట్ రూ.1.77 కోట్లు వసూళ్లు చేస్తుంది. తెలుగులో రూ.1.28 కోట్లు హిందీలో రూ.7 లక్షలు, తెలుగులో రూ.42 లక్షలు వసూళ్లు చేసిందని సాక్ నిల్క్ గణంకాలు తెలిపాయి. ఇక ఇండియా గ్రాస్ రూ.3.5 కోట్ల వరకు వసూళ్లు చేసిందని ట్రేడ్ నిపుణులు తెలియజేస్తున్నారు. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.89 కోట్ల వరకు వసూళ్లు చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X