Vikram movie day 3 collections.. బాక్సాఫీస్ వద్ద కమల్ హాసన్.. 150 కోట్లు దాటేసి సరికొత్త రికార్డులు
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య కలిసి నటించిన విక్రమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయ ఢంకా మోగిస్తున్నది. అందరి నోట అద్భుతమైన చిత్రంగా ఏకపక్షంగా టాక్ అందుకొని బ్లాక్ బస్టర్ మూవీగా దూసుకెళ్తున్నది. దక్షిణాదితోపాటు హిందీ, ఓవర్ససీ మార్కెట్‌లో భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం 150 కోట్ల వైపు దూసుకెళ్తున్నది. ఈ సినిమా 3వ రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే..

మలేషియా, ఆస్ట్రేలియాలో
ఓవర్సీస్ విషయానికి వస్తే.. విక్రమ్ చిత్రం మలేషియాలో భారీ అడ్వాన్స్ బుకింగ్‌ను నమోదు చేసింది. 96 లొకేషన్లలో 1280 షోల ద్వారా సమారు 30 వేల టికెట్లను అమ్మడం జరిగింది. ఇక ఆస్ట్రేలియాలో 66 లోకేషన్లలో 191 షోల ద్వారా 6 వేలకుపైగా టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమ్ముడుపోయాయి అని అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆస్ట్రేలియాలోనే 150k, మలేషియాలో మరో 200k వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

అమెరికాలో కాసుల పంట
అలాగే అమెరికాలో విక్రమ్ చిత్రం డబుల్ ధమాకాను సృష్టించింది. మూడు రోజుల్లోనే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రికార్డుస్థాయి వసూళ్లను నమోదు చేస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్ోల మార్కును చేరుకొన్నది. కరెంట్ బుకింగ్ క్లోజింగ్ తర్వాత మరింతగా గణాంకాలు పెరిగే అవకాశం ఉంది.

తమిళనాడులో విజృంభణ
తమిళనాడులో విక్రమ్ వసూళ్ల విజృంభణ కొనసాగుతునే ఉంది. తొలి రోజున అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 9.44 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.05 కోట్లు, మూడో రోజున 9.85 కోట్లు నమోదు చేసింది. కరెంట్ బుకింగ్ తో కలిపి 1930 షోల ద్వారా గ్రాస్ 8.2 కోట్లు రాబట్టింది. మూడో రోజు ముగిసే సమయానికి అడ్వాన్స్, కరెంట్ బుకింగ్‌తో కలిపి తమిళనాడులో 22 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కేరళ, కర్ణాటకలో
ఇక కేరళలో కూడా 1078 షోల ద్వారా అడ్వాన్సు బుకింగ్ రూపంలో 2.15 కోట్లు రాబట్టింది. కరెంట్ బుకింగ్‌తో కలిపి మరో 5 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇక కర్ణాటకలో కూడా సుమారుగా 4 కోట్ల రూపాయాలు కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు.

తెలుగు రాష్ట్రాల్లో
తెలుగు రాష్ట్రాల్లో భారీగా విక్రమ్ సినిమా కలెక్షన్లను రాబడుతున్నది. అడ్వాన్స్ బుకింగ్, కరెంట్ బుకింగ్ అనే తేడా లేకుండా భారీ స్పందన కనిపిస్తున్నది. మూడో రోజున 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను, 2 కోట్ల షేర్‌ను నమోదు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల రిపోర్ట్.

ఇండియా వైడ్‌గా చూసుకొంటే..
ఇక ఇండియా వైడ్‌గా చూసుకొంటే.. మూడో రోజున విక్రమ్ చిత్రం 16 కోట్ల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, నైజాం, ఇతర రాష్ట్రాలతో కలిపి 31 కోట్ల షేర్, 50 కోట్లకుపైగా గ్రాస్ నమోదు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు 160 కోట్ల రూపాయలు రాబట్ట వచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











