Vikram movie day 4 collections.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రచ్చ.. తమిళనాడులోనే 100 కోట్ల కుమ్ముడు!
అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న విక్రమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నిలకడగా వసూళ్లు కలెక్ట్ చేస్తున్నది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య నటించిన ఈ చిత్రానికి విడుదలైన ప్రతీ చోట బ్రహ్మరథం పడుతున్నారు. అయితే అన్ని సినిమాలకు లిట్మస్ టెస్ట్‌గా మారే సోమవారం కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వ్యక్తం కావడం విశేషంగా మారింది. విక్రమ్ మూవీ 4వ రోజు వసూళ్ల విషయానికి వస్తే..

మలేషియాలో భారీగా అడ్వాన్స్ బుకింగ్
ఓవర్సీస్‌లో వర్కింగ్ డే రోజు అయిన సోమవారం కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఆస్ట్రేలియాలో 4వ రోజున ఈ చిత్రం 67 లొకేషన్లలో 182 షోల కోసం 1650 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక మలేషియాలో ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తున్నది. 99 లొకేషన్లలో 1055 షోల కోసం 21 వేల టికెట్లు నాలుగో రోజున అమ్ముడుపోవడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను తెలియజెప్పింది.

అమెరికాలో ఎలా ఉందంటే..
ఇక అమెరికాలో విక్రమ్ చిత్రం దుమ్మురేపుతున్నది. మేజర్, పృథ్వీరాజ్ సినిమాల పోటిని ఎదుర్కొని భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఇప్పటి వరకు 85 లొకేషన్లలో 234 షోల ద్వారా 26k డాలర్లను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కలెక్ట్ చేసింది. సోమవారం నాడు గత సినిమాలు సాధించిన వసూళ్లతో పోల్చుకొంటే.. మెరుగైన ఫలితాలుగా ఈ సినిమా ఘనతను దక్కించుకొన్నది. ఫ్రాన్స్, యూకేలో కూడా భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.

తమిళనాడులో 100 కోట్ల వైపు
విక్రమ్ చిత్రం తమిళనాడులో వసూళ్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. గత మూడు రోజుల్లో 67 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం సోమవారం కూడా భారీ వసూళ్లను నమోదు చేసే దిశగా అడ్వాన్స్ బుకింగ్ రికార్డైంది. నాలుగో రోజున తమిళనాడులో 1315 షోల ద్వారా 3.24 కోట్ల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్‌గా నమోదు చేసింది.

కేరళలో రికార్డు కలెక్షన్లు
కేరళ రాష్ట్రంలో విక్రమ్ సినిమాకు అనూహ్య స్పందన వ్యక్తమవుతున్నది. గత మూడు రోజుల్లో 15 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సంపాదించిన ఈ చిత్రం సోమవారం కూడా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. కరెంట్ బుకింగ్ ముగిసే సమయానికి ఈ చిత్రం 3 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్
తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ సినిమా గత మూడు రోజుల్లో 12.26 కోట్ల గ్రాస్, 6.55 కోట్ల షేర్ సాధించింది. అయితే ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషంగా మారింది. నాలుగో రోజున కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. దాంతో ఈ చిత్రం 4వ రోజున 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసే ఛాన్స్ కనిపిస్తున్నది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా
ఇక ప్రపంచవ్యాప్తంగా విక్రమ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియా వైడ్‌గా 15 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌లో కనీసం 15 కోట్ల రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 30 కోట్ల షేర్ నమోదు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 185 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











