Vikram 4th day collections.. బాక్సాఫీస్ మాన్‌స్టర్‌గా కమల్ హాసన్.. ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందంటే?
దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విక్రమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం 160 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అన్ని సినిమాలకు బ్లాక్ మండేగా మారే సోమవారం కూడా విక్రమ్ వసూళ్లపరంగా చెలరేగిపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే నాలుగో రోజున ఈ చిత్రం ఎంత వసూలు చేసిందంటే..

ఓవర్సీస్‌లో స్ట్రాంగ్‌గా
ఓవర్సీస్‌లో విక్రమ్ యమ స్ట్రాంగ్‌గా వసూళ్లను రాబడుతున్నది. సోమవారం కడపటి వార్తలు అందే సరికి ఈ చిత్రం అమెరికాలో 386 లోకేషన్లలో 110k డాలర్లను వసూలు చేసింది. ఇప్పటికే ఈ చిత్రం ఓవర్సీస్‌లో 56 కోట్లు వసూలు చేసింది. బ్రిటన్, గల్ఫ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్ ఇతర దేశాల నుంచి కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది. RRR, కేజీఎఫ్2, f3 తర్వాత సోమవారం అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది భాషా చిత్రంగా విక్రమ్ రికార్డును సొంతం చేసుకొన్నది.

కేరళలో భారీగా
కేరళలో విక్రమ్ సినిమా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ.. ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. 4వ రోజున 812 షోల ద్వారా 1.84 కోట్ల షేర్, మూడు కోట్లకుపైగా గ్రాస్‌ను రాబట్టింది. కేరళలో ఇప్పటికే ఈ చిత్రం 15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

తమిళనాడులో జైత్రయాత్ర
తమిళనాడులో గత మూడు రోజుల్లో విక్రమ్ చిత్రం 64.5 కోట్లు రాబట్టింది. 4వ రోజున ఈ చిత్రం మరో 6 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. చెన్నై మహా నగరంలోనే సోమవారం 1 కోటి రూపాయల గ్రాస్‌ను సొంతం చేసుకొన్నది. దాంతో ఈ చిత్రం 70 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. 5వ రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్ వివరాలు మరింత స్ట్రాంగ్‌గా ఉన్నాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి
తెలుగు రాష్ట్రాల్లో కూడా విక్రమ్ భారీ వసూళ్లను రాబడుతున్నది. కర్నూలు సిటీలో 4వ రోజున విక్రమ్ చిత్రం 4.62 లక్షలు రాబట్టింది. కర్నూల సిటీలో నాలుగు రోజుల కలెక్షన్లు 23 లక్షలుగా నమోదైంది. అనంతపురం సిటీలో 4 రోజున 3.11 లక్షలు వసూలు చేసింది. భీమవరంలో 2.26 లక్షలతో మొత్తంగా 10 లక్షలు రాబట్టింది. తాడెపల్లి గూడెంలో 74 వేలు, ఏలూరులో 2.15 లక్షలతో గత నాలుగు రోజుల్లో 12 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇంకా పలు పట్టణాల వసూళ్లు అందాల్సి ఉంది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 1.25 కోట్ల షేర్ సాధించింది. దాంతో ఈ చిత్రం 7.5 కోట్ల షేర్‌ను నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 4వ రోజు ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా విక్రమ్ సినిమా కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తమిళనాడులో 70.50 కోట్లు, ఏపీ, తెలంగాణలో 14.26 గ్రాస్, కర్ణాటకలో 12.02 కోట్లు, కేరళలో 16 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 3.35 కోట్లు, ఓవర్సీస్‌లో 60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 175 కోట్లు సంపాదించింది.


Click it and Unblock the Notifications











