Kamal Haasan’s Vikram business రిలీజ్‌కు ముందే కోట్ల రూపాయల లాభం.. ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ ఎంతంటే?
దేశం గర్వించదగిన విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రం జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. నాలుగేళ్ల తర్వాత కమల్ నటించిన సినిమా థియేటర్‌లో రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, నరైన్, చెంబన్ వినోద్, కాళిదాస్ జయరామ్ లాంటి ప్రముఖులు నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ప్రేక్షకులతోపాటు సినీ వర్గాల్లో నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి రికార్డు స్థాయిలో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..
Recommended Video


150 కోట్ల బడ్జెట్‌తో
విక్రమ్ సినిమా కథ విషయానికి వస్తే.. అన్నదమ్ములైన ఓ గ్యాంగ్‌స్టర్, ఓ పొలిటిషియన్ జీవితాల నేపథ్యంగా, వారి మధ్య చోటుచేసుకొన్న విభేదాల నేపథ్యంలో రా ఏజెంట్ (కమల్ హాసన్)గా ఏం చేశాడనే కథగా తెరకెక్కింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది.

తమిళ, తెలుగు, కర్ణాటకలో
ప్రతిష్టాత్మకంగా, హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన విక్రమ్ సినిమా ప్రీ రిలీజ్ గ్రాండ్‌గా జరిగింది. తమిళనాడు థియేట్రికల్ హక్కులు 35 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. అలాగే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ డబ్బింగ్ రైట్స్ 6 కోట్ల రూపాయలకు, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5.50 కోట్ల రూపాయలు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ప్రపంచవ్యాప్తంగా బిజినెస్
ఇక కేరళ రాష్ట్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. మలయాళ థియేట్రికల్ హక్కులు 4.25 కోట్లుకు, హిందీ డబ్బింగ్ రైట్స్ 35 కోట్లకు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 16 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో థియేట్రికల్ పరంగా ప్రీ రిలీజ్ బిజినెస్ 95.75 కోట్లుగా నమోదైంది.

శాటిలైట్, ఓటీటీ రైట్స్..
విక్రమ్ మూవీకి సంబంధించిన శాటిలైట్, డిజిటల్, ఓటీటీ రైట్స్‌కు భారీ డిమాండ్ కనిపించింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాలకు సంబంధించిన హక్కులు 98 కోట్ల మేరకు అమ్ముడుపోయాయి. ఆడియో రైట్స్ 3 కోట్లకు, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దాంతో ఓవరాల్‌గా ఈ సినిమా 198.75 కోట్లుగా నమోదైంది. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే సుమారు 50 కోట్ల లాభం దక్కింది.

నితిన్ చేతికి ఫ్యాన్సీ రేటుకు
విక్రమ్ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను నిర్మాత సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ ఫ్యామిలీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకొన్నది. తెలుగు రైట్స్‌ను 6 కోట్ల రూపాయల డీల్‌తో నితిన్ ఫ్యామిలీ చేజిక్కించుకొన్నది. అయితే కమల్ సినిమా హక్కులు తక్కువ మొత్తానికే చేజిక్కించుకొన్నారని, సినిమా యావరేజ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కావడం చాలా సులభం.. హిట్ టాక్ వస్తే.. సినిమా కలెక్షన్ల రేంజ్ ఊహించడం కష్టం అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. హిట్ టాక్ వస్తే.. కనీసం 15 కోట్ల షేర్ రావడం గ్యారెంటీ అని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











