Bharateeyudu 2 Business: కమల్ సినిమాకు తెలుగులో రికార్డు బిజినెస్.. ఎన్ని కోట్లు వస్తే హిట్ అవుతుందంటే!
ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో విశ్వనాయకుడు కమల్ హాసన్ ఒకరు. ఎన్నో ఏళ్లుగా విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న ఆయన.. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను అందుకుంటూ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'భారతీయుడు 2' అనే మూవీని చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రం తెలుగులో ఎన్ని కోట్ల బిజినెస్ చేసుకుందో మీరే చూసేయండి!
భారతీయుడు మళ్లీ రెడీగా
విశ్వనాయకుడు కమల్ హాసన్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ తెరకెక్కించిన చిత్రమే 'భారతీయుడు 2' (Indian 2). ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ మూవీస్ బ్యానర్లపై శుభకరణ్, ఉదయనిధి స్టాలిన్ నిర్మించారు. ఇందులో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్యలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.

అలాంటి కథ.. సందేశంతో
లంచాలు తీసుకునే అధికారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కథతో రూపొందిన చిత్రమే 'భారతీయుడు'. 1996లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా అలాంటి కథతోనే దీనికి సీక్వెల్‌గా రాబోతున్న చిత్రమే 'భారతీయుడు 2'. మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.
ప్రమోషన్స్‌తో సందడిగా
యూనివర్శల్ స్టోరీ రూపొందిన 'భారతీయుడు 2' సినిమాను జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీన్ని తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా తీసుకు రాబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లు, ఇంటర్వ్యూలు కూడా జరిగాయి.

కమల్‌కు రికార్డు బిజినెస్
విశ్వనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన 'భారతీయుడు 2' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హక్కులకు తెలుగులోనూ పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 9 కోట్లు, ఆంధ్రాలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లతో కలుపుకుని రూ. 24 కోట్లు మేర బిజినెస్‌ను జరుపుకుంది.
అన్ని కోట్లు వస్తేనే హిట్
కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' మూవీకి బిజినెస్ రికార్డు స్థాయిలోనే జరిగింది. ఇక, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఏరియాల్లో కలిపి ఊహించని విధంగా రూ. 24 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25.00 కోట్లుగా నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

కమల్ కెరీర్‌లో టాప్‌లో
తెలుగులోకి వస్తున్న డబ్బింగ్ సినిమాల్లో కొన్నింటికి మాత్రమే మంచి బిజినెస్ జరుగుతుంది. అందులో 'భారతీయుడు 2' చిత్రానికి రూ. 24 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తద్వారా కమల్ హాసన్ కెరీర్‌లోనే టాప్ మూవీగా ఇది రికార్డు సాధించింది. అదే సమయంలో తెలుగులో ఎక్కువ వ్యాపారం చేసిన చిత్రాల లిస్టులో ఇది ఏడో స్థానానికి కూడా చేరుకుంది.


Click it and Unblock the Notifications











