Bharateeyudu 2 Collections: 172 కోట్లు వస్తే హిట్.. కానీ 2 వారాల్లో దారుణంగా.. కమల్‌కు నష్టం ఎంతంటే!
దక్షిణ భారతదేశంలో ఎంతో మంది సీనియర్ స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే నేషనల్ వైడ్ క్రేజ్‌తో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో విశ్వనాయకుడు కమల్ హాసన్ ఒకరు. సుదీర్ఘ కాలంగా తనదైన నటనతో మాయ చేస్తోన్న ఆయన.. ఇప్పటికీ అదే జోరుతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇటీవలే ఈ సీనియర్ హీరో 'భారతీయుడు 2' (Indian 2) అనే మూవీ చేశారు. దీనికి ప్రేక్షకులు పెద్దగా స్పందన అందించట్లేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం 2 వారాల కలెక్షన్లను మీరే చూసేయండి!
భారతీయుడు మళ్లీ వచ్చాడు
విశ్వనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'భారతీయుడు 2' లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ మూవీస్ బ్యానర్లపై శుభకరణ్, ఉదయనిధి స్టాలిన్ నిర్మించారు. ఇందులో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్యలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చాడు.

కమల్ మూవీ బిజినెస్ ఇలా
'విక్రమ్'తో సెన్సేషనల్ హిట్‌ను అందుకున్న తర్వాత కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా తెలుగులో రూ. 24 కోట్లు బిజినెస్ చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలనూ కలుపుకుని ఇది రూ. 170 కోట్లు వ్యాపారం చేసింది.
14వ రోజు తెలుగు కలెక్షన్లు
పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా విశ్వనాయకుడు కమల్ హాసన్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే 'భారతీయుడు 2' మూవీని ఇక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. దీనికి ఫస్ట్ వీక్ మంచి వసూళ్లు వచ్చినా.. రెండో వారం భారీగా తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 3 లక్షలు షేర్‌నే వసూలు చేసింది.

14 రోజులకూ కలిపి ఎంత?
'భారతీయుడు 2' చిత్రానికి 14 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు డల్‌గా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.98 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.79 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 1.63 కోట్లు, ఈస్ట్‌లో రూ. 95 లక్షలు, వెస్ట్‌లో రూ. 64 లక్షలు, గుంటూరులో రూ. 1.15 కోట్లు, కృష్ణాలో రూ. 92 లక్షలు, నెల్లూరులో రూ. 49 లక్షలతో కలిపి రూ. 13.55 కోట్లు షేర్, రూ. 23.45 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
14 రోజుల్లో 'భారతీయుడు' సినిమాకు తమిళనాడులో రూ. 52.85 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 23.45 కోట్లు, కర్నాటకలో రూ. 9.30 కోట్లు, కేరళలో రూ. 5.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 50.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఇలా ఇప్పటికి ఈ మూవీ రూ. 150.30 కోట్లు గ్రాస్, రూ. 72.85 కోట్లు షేర్‌ను మాత్రమే వసూలు చేసుకుంది.
కమల్ నటించిన 'భారతీయుడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 170 కోట్లు బిజినెస్ చేయగా.. 14 రోజుల్లో రూ. 72.85 కోట్లు రాబట్టింది. అంటే.. ఇంకా రూ. 99.15 కోట్లు వస్తేనే హిట్ అవుతుంది. ఇక, తెలుగులో దీనికి రూ. 24 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 25 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీ హిట్‌కు రూ. 11.45 కోట్లు వెనుకబడి ఉంది.


Click it and Unblock the Notifications











