కర్ణాటకలో థగ్ లైఫ్ నిషేధం.. కమల్ హాసన్ కు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం 'థగ్ లైఫ్'. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ను అన్ని భాషల్లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇదే క్రమంలో కర్ణాటకలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో కమల్ హాసన్ ప్రసంగం వివాదాస్పందంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను కర్ణాటక రాష్ట్రంలో బ్యాన్ చేశారు. ఈరోజులు ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేసిన తరుణంలో కర్ణాటకలో మాత్రం నిషేధించడం హాట్ టాపిక్ గ్గా మారింది. దీని వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లకు గండి పడిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
కర్ణాటక మినహా.. థగ్ లైఫ్ గ్రాండ్ రిలీజ్..
కమల్ హాసన్ తో పాటు భారీ తారాగణం నటించిన 'థగ్ లైఫ్' చిత్రాన్ని ప్రపంపచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేశారు. నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులను కలుపుకొని రూ.250 కోట్లు ఖర్చైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, రెడ్ గెయింట్, మద్రాస్ టాకీస్ వంటి బ్యానర్లలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇండియాలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మరోవైపు యూనైటెడ్ కింగ్డమ్స్ లో ఏకంగా 225కుపైగా స్క్రీన్లలో విడుదలవడం విశేషం. ఇలా అన్నీ ఏరియాల్లో, ఓవర్సీస్ లోనూ మంచి గ్రాండ్ రిలీజ్ జరిగినా.. కర్ణాటక రాష్ట్రంలో మాత్రం పూర్తిగా ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు.

కమల్ హాసన్ తగ్గనంటే తగ్గనన్నాడు..
థగ్ లైఫ్ ప్రచార కార్యక్రమాల నిమిత్తం టీమ్ కర్ణాటకకు వెళ్లిన సందర్భంగా కమల్ హాసన్ ప్రసంగం వివాదాస్పందంగా మారింది. కన్నడ భాష తమ తమిళ భాష నుంచే ఉద్భవించిందని కమల్ హాసన్ అనడంతో పెద్ద దుమారం రేపింది. కన్నడిగులు కమల్ హాసన్ పై కన్నెర్ర చేశారు. కమల్ హాసన్ మాటలను వెనక్కి తీసుకోవాలని కన్నడిగులు డిమాండ్ చేశారు.
కానీ కమల్ హాసన్ ఏమాత్రం తగ్గలేదు. ఇక ఈ వివాదం కోర్టు మెట్లు ఎక్కగా.. కమల్ హాసన్ కు వ్యతిరేకంగా కర్ణాటక కోర్టు తీర్పునిచ్చింది. థగ్ లైగ్ సినిమా సాఫీగా రిలీజ్ కావాలంటే వెంటనే కన్నడిగులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని సూచించింది. కానీ కమల్ హాసన్ క్షమాపణలు చెప్పడానికి అంగీకరించలేదు.
కమల్ హాసన్ వల్ల 30 కోట్ల నష్టం..
కమల్ హాసన్ వల్ల థగ్ లైఫ్ సినిమాకు నష్టం కలిగిందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కమల్ హాసన్ కన్నడిగులతో ఉన్న వివాదం కారణంగా అక్కడ థగ్ లైఫ్ సినిమాను నిషేధించారు. దీంతో కర్ణాటక మార్కెట్ నుంచి రూ.30 కోట్ల గ్రాస్ వరకు థగ్ లైఫ్ సినిమాకు నష్టమే కలిగించిందని అంటున్నారు. కానీ కమల్ హాసన్ మాత్రం గరిష్ఠంగా అక్కడ రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు నష్టం జరుగుతుందని ముందే అంచనా వేసుకొని కన్నడిగులకు సారీ చెప్పడానికి ఒప్పుకోలేదని తమిళ చిత్ర ప్రముఖులు తెలుపుతున్నారు. ఇక ఈ కేసు సంబంధించిన తరువాత విచారణ జూన్ 10కి వాయిదా పడింది. ఆ తర్వాత ఏం జరగనుందనేది ఉత్కంఠగా మారింది.


Click it and Unblock the Notifications











