Vikram 10 Days Collections: సండే విక్రమ్ హవా.. 10 రోజుల్లోనే అన్ని కోట్లు.. నితిన్‌కు లాభం ఎంతంటే!
కమల్ హాసన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో హవాను చూపిస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్నారు. విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అయితే, చాలా కాలంగా కమల్‌కు భారీ సక్సెస్ రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'విక్రమ్' అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి పది రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయి? తెలుగు రైట్స్ కొన్న నితిన్‌కు లాభం ఎంత వచ్చింది? అనేవి చూద్దాం పదండి!

విక్రమ్‌గా కమల్ హాసన్ విశ్వరూపం
దక్షిణాది సీనియర్ హీరో విశ్వనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ రూపొందించిన చిత్రమే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'విక్రమ్' మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ ఈ సినిమా హక్కులను కొన్నాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు తెలిసింది.

10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
10వ రోజూ 'విక్రమ్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 41 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 95 లక్షలు షేర్, రూ. 1.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

10 రోజులకూ కలిపి ఎంతొచ్చింది
'విక్రమ్' 10 రోజుల్లోనూ ఆంధ్రా, తెలంగాణలో బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 5.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.78 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.94 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 కోటి, వెస్ట్ గోదావరిలో రూ. 67 లక్షలు, గుంటూరులో రూ. 89 లక్షలు, కృష్ణాలో రూ. 97 లక్షలు, నెల్లూరులో రూ. 48 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 13.48 కోట్లు షేర్, రూ. 23.61 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా
తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో రూ. 13.48 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 10వ రోజు రూ. 11.70 కోట్లు షేర్ రాబట్టింది. వీటితో కలిపి 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 146 కోట్లు షేర్‌తో పాటు రూ. 295.71 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?
'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 10 రోజుల్లోనే రూ. 146 కోట్లు వచ్చాయి. అంటే రూ. 45 కోట్లు పైగా లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 13.48 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 5.98 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.


Click it and Unblock the Notifications











