Vikram 11 Days Collections: సోమవారం కూడా విక్రమ్ హవా... ఆ రెండు తెలుగు సినిమాలను దాటేసి మరీ!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో హవాను చూపిస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్న కమల్ హాసన్ కు చాలా కాలంగా సరైన సక్సెస్ రావడం లేదు. ఆయన ఇటీవలే 'విక్రమ్' అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు పదకొండు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయి? అనేది బాక్సాఫీస్ రిపోర్టులో చూద్దాం!

కమల్ హాసన్ విశ్వరూపం

కమల్ హాసన్ విశ్వరూపం

దక్షిణాది సీనియర్ హీరో, ఉలగ నాయగన్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ రూపొందించిన చిత్రం 'విక్రమ్'. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య కీలక పాత్రలు పోషించారు. ఈ సబ్జెక్ట్ మీద నమ్మకం ఉండంతో మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చగా సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

భారీ స్థాయిలో బిజినెస్

భారీ స్థాయిలో బిజినెస్


'విక్రమ్' మూవీకి తమిళం సహా మిగతా ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండటంతో ఆంధ్ర, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ విక్రమ్ సినిమా హక్కులను కొన్నాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 110 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

11వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

11వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


11వ రోజూ 'విక్రమ్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 38 లక్షలు షేర్, రూ. 0.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

11 రోజులకూ కలిపి

11 రోజులకూ కలిపి

'విక్రమ్' 11 రోజుల్లోనూ ఆంధ్రా, తెలంగాణలో బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 5.89 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.00 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.04 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 69 లక్షలు, గుంటూరులో రూ. 92 లక్షలు, కృష్ణాలో రూ. కోటి రూపాయిలు, నెల్లూరులో రూ. 49 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 13.86 కోట్లు షేర్, రూ. 24.21 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా

ప్రపంచ వ్యాప్తంగా

తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో రూ. 13.86 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. ఈ దెబ్బతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌, హిందీ సహా తమిళనాడులో కలిపి ఈ సినిమా 11 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 155.05 కోట్లు షేర్‌తో పాటు రూ. 310.11 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 110 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లు పెట్టి కొన్నాడు. ఇక, ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లోనే రూ. 155.05 కోట్లు వచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 13.86 కోట్లు రావడంతో ఇప్పటికే సినిమాకు రూ. 7.50 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X