twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vikram 12 Days Collections: తెలుగు సినిమాలను వెనక్కి నెట్టిన విక్రమ్..మాములుగా లేదుగా!

    |

    తమిళ స్టార్ హీరోనే అయినా దక్షిణాది మొత్తంలో ఉలగ నాయగన్ అనిపించుకున్న కమల్ హాసన్ కు చాలా కాలంగా సరైన హిట్ పడలేదు. ఎలా అయినా భారతీయుడు 2 సినిమాతో సక్సెస్ అందుకుందామని అనుకుంటే అది వర్కౌట్ కాకపోవడంతో లోకేష్ కనగారాజ్ దర్శకత్వంలో 'విక్రమ్' అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మొదటి ఆట నుంచి మంచి క్రేజ్ సంపాదించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు పన్నెండు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయి? అనేది బాక్సాఫీస్ రిపోర్టులో చూద్దాం!

    స్వయంగా నిర్మించి

    స్వయంగా నిర్మించి


    దక్షిణాది సీనియర్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో యంగ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ రూపొందించిన తాజా చిత్రం 'విక్రమ్'. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య కీలక పాత్రలు పోషించారు. విన్న వెంటనే కనెక్ట్ కావడంతో ఈ సినిమాను వేరే నిర్మాతల కోసం వేచి చూడకుండా స్వయంగా కమల్ హాసన్ నిర్మించారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చగా ముందు నుంచే ఆయన సాంగ్స్ సినిమా మీద ఆసక్తి పెంచాయి.

    భారీ స్థాయిలో బిజినెస్

    భారీ స్థాయిలో బిజినెస్


    'విక్రమ్' మూవీకి ఏర్పడిన క్రేజ్ వల్ల కమల్, లోకేష్ మార్కెట్ కారణంగా తమిళం సహా మిగతా ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అలాగే, కమల్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్ ప్రకారం ఆంధ్ర, తెలంగాణలో రూ. 7 కోట్లకు హీరో నితిన్ విక్రమ్ సినిమా హక్కులను కొన్నాడు. అలా తెలుగు సహా తమిళంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 110 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

    12వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    12వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


    12వ రోజూ 'విక్రమ్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 32 లక్షలు షేర్, రూ. 0.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

    12 రోజులకూ కలిపి

    12 రోజులకూ కలిపి


    'విక్రమ్' 12 రోజుల్లోనూ ఆంధ్రా, తెలంగాణలో బాగా రాబట్టింది. ఇక ఆ లెక్క 12 రోజులకు కలిపి నైజాంలో రూ. 6.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.87 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.05 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.06 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 71 లక్షలు, గుంటూరులో రూ. 95 లక్షలు, కృష్ణాలో రూ. 1.03 కోట్లు రూపాయిలు, నెల్లూరులో రూ. 50 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 14.18 కోట్లు షేర్, రూ.24.71 కోట్లు గ్రాస్ దక్కింది.

    ప్రపంచ వ్యాప్తంగా

    ప్రపంచ వ్యాప్తంగా


    తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో రూ. 14.18 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. ఈ దెబ్బతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌, హిందీ సహా తమిళనాడులో కలిపి ఈ సినిమా 12 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.161.35 కోట్లు షేర్‌తో పాటు రూ. 323.01 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 110 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లు పెట్టి కొన్నాడు. తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. ఇప్పటికే రూ. 14.18 కోట్లు రావడంతో ఇప్పటికే సినిమాకు రూ. 6.68 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

    English summary
    Kamal Haasan Vikram Movie 12 Days Box Office Collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X