Vikram 13 Days Collections: ఎక్కడా తగ్గని విక్రమ్.. అంటే సుందరానికీ కలెక్షన్స్ కు దగ్గరగా!

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కు చాలా కాలంగా సరైన హిట్ పడలేదు. తమిళంలో మంచి ఫామ్లో ఉన్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'విక్రమ్' అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కమల్. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మొదటి ఆట నుంచి మంచి క్రేజ్ సంపాదించదాంతో కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు పదమూడు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయి? అనేది బాక్సాఫీస్ రిపోర్టులో చూద్దాం!

110 కోట్ల మేర

110 కోట్ల మేర

కమల్ హాసన్ హీరోగా ఖైదీ, మాస్టర్ సినిమాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించిన తాజా చిత్రం 'విక్రమ్'. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను స్వయంగా కమల్ హాసన్ నిర్మించారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇక ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 110 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

13వ రోజూ

13వ రోజూ

13వ రోజూ 'విక్రమ్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 24 లక్షలు షేర్, రూ. 0.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

'విక్రమ్' 13 రోజుల్లో

'విక్రమ్' 13 రోజుల్లో

'విక్రమ్' 13 రోజుల్లోనూ ఆంధ్రా, తెలంగాణలో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఆ లెక్క 13 రోజులకు కలిపి నైజాంలో రూ. 6.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.90 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.08 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.08 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 72 లక్షలు, గుంటూరులో రూ. 97 లక్షలు, కృష్ణాలో రూ. 1.06 కోట్లు రూపాయిలు, నెల్లూరులో రూ. 51 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 14.42 కోట్లు షేర్, రూ.24.11 కోట్లు గ్రాస్ దక్కింది.

6.92 కోట్లు ప్రాఫిట్

6.92 కోట్లు ప్రాఫిట్

తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లో రూ. 14.42 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచవ్యాప్తంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌, హిందీ సహా తమిళనాడులో కలిపి ఈ సినిమా 13 రోజుల్లోనే రూ.166.40 కోట్లు షేర్‌తో పాటు రూ. 333.38 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఈ సినిమాను తెలుగులో నితిన్ రూ. 7 కోట్లు పెట్టి కొన్నాడు. తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. ఇప్పటికే రూ. 14.42 కోట్లు రావడంతో ఇప్పటికే సినిమాకు రూ. 6.92 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

షాకింగ్ గా

షాకింగ్ గా

అయితే ఈ సినిమా నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమా కలెక్షన్స్ కు దగ్గరగా రావడం గమనార్హం. నాని సినిమా ఐదో రోజు 30 లక్షలు దక్కించుకోగా కమల్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 24 లక్షలు కొల్లకొట్టడం, అది కూడా రెండో వారంలో అనేది ట్రేడ్ వర్గాల వారికీ షాకింగ్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X