Vikram 15 Days Collections: విక్రమ్‌కు కాసుల వర్షం.. 15వ రోజూ షాకింగ్‌గా.. బాహుబలి రికార్డుకు చేరువ
దాదాపు నాలుగు దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో హవాను చూపిస్తూ సౌతిండియన్ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నారు విశ్వ నాయకుడు కమల్ హాసన్. విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆయన.. చాలా కాలంగా విజయాన్ని మాత్రం అందుకోవడంలో విఫలం అవుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే 'విక్రమ్' అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విక్రమ్‌కు 15 రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయి అన్నది చూద్దాం పదండి!

విక్రమ్‌గా కమల్ హాసన్ అరాచకం
సీనియర్ హీరో విశ్వనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ రూపొందించిన చిత్రమే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'విక్రమ్' మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 150 కోట్ల మేర వ్యాపారం జరిగింది.

15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'విక్రమ్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లోనూ ఆరంభంలో మంచి టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన దక్కింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. అలాగే, లాభాల బాటలోనూ పయనిస్తోంది. ఈ నేపథ్యంలో 15వ రోజూ మంచి రెస్పాన్స్‌తో ఇది రూ. 16 లక్షలు రాబట్టింది.

15 రోజులకూ కలిపి ఎంతొచ్చింది
'విక్రమ్' 15 రోజుల్లోనూ ఆంధ్రా, తెలంగాణలో బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 6.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.94 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.13 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.09 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 74 లక్షలు, గుంటూరులో రూ. 99 లక్షలు, కృష్ణాలో రూ. 1.10 కోట్లు, నెల్లూరులో రూ. 51 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 14.75 కోట్లు షేర్, రూ. 25.71 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా
తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల్లో రూ. 14.75 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 15వ రోజు రూ. 2 కోట్లు షేర్ రాబట్టింది. వీటితో కలిపి 15 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కమల్ సినిమాకు రూ. 170 కోట్లు షేర్‌తో పాటు రూ. 344.91 కోట్లు గ్రాస్ వసూలైంది.

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?
'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 15 రోజుల్లోనే రూ. 170 కోట్లు వచ్చాయి. అంటే రూ. 69 కోట్లు పైగా లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 14.75 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 7.25 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

బాహుబలి రికార్డుకు చేరువగా
తమిళనాడులో 'విక్రమ్' మూవీ 15 రోజుల్లోనే రూ. 148.85 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా ఆల్‌టైం రికార్డుకు చేరువైంది. గతంలో బాహుబలి మూవీ ఆ రాష్ట్రంలో రూ. 155 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి టాప్‌లో నిలిచింది. అంటే.. ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు విక్రమ్ మూవీ చేరువైంది. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తే రెండు రోజుల్లోనే ఇది బ్రేకయ్యే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











