Vikram 17 Days Collections: ఆదివారం విక్రమ్ హవా.. పుష్ప రికార్డు బ్రేక్.. నితిన్‌కు లాభం ఎంతంటే!
విలక్షణ నటన, విభిన్నమైన చిత్రాలతో సౌత్ ఇండియాలోనే టాప్ హీరోగా వెలుగొందుతూ.. సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులకు మజాను పంచుతోన్న నటుడు విశ్వనాయకుడు కమల్ హాసన్. చాలా భాషల్లో నేరుగా సినిమాలు చేసిన ఆయన.. ఎన్నో అవార్డులను అందుకున్నారు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను భారీగా ఏర్పరచుకుని అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నారు. అయితే, కొన్నేళ్లుగా కమల్‌కు సరైన హిట్ రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఆయన 'విక్రమ్' అనే సినిమాతో వచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీకి అదిరిపోయే స్పందన దక్కుతోంది. ఫలితంగా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 17 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

విక్రమ్‌గా కమల్ హాసన్ విశ్వరూపం
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ రూపొందించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్
పూర్తి స్థాయి యాక్షన్ నేపథ్యంతో వచ్చిన 'విక్రమ్' మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర వ్యాపారం జరిగింది.

17వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'విక్రమ్' మూవీకి తమిళంలో మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లోనూ ఆరంభంలో మంచి టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా అత్యధికంగా వస్తున్నాయి. దీంతో టార్గెట్‌ను చేరుకుని లాభాల బాటలోనూ పయనిస్తోంది. ఈ నేపథ్యంలో 17వ రోజూ మంచి రెస్పాన్స్‌తో ఇది రూ. 44 లక్షలు రాబట్టింది.

17 రోజులకూ కలిపి ఎంతొచ్చింది
17 రోజుల్లోనూ 'విక్రమ్' ఆంధ్రా, తెలంగాణలో భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 6.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.03 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.24 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.16 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 78 లక్షలు, గుంటూరులో రూ. 1.05 కోట్లు, కృష్ణాలో రూ. 1.17 కోట్లు, నెల్లూరులో రూ. 54 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 15.47 కోట్లు షేర్, రూ. 27.05 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా
తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో రూ. 15.47 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 17వ రోజు రూ. 5 కోట్లు షేర్ రాబట్టింది. వీటితో కలిపి 17 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కమల్ సినిమాకు రూ. 179.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 363.80 కోట్లు గ్రాస్ వసూలైంది.

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?
'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 17 రోజుల్లోనే రూ. 179.20 కోట్లు వచ్చాయి. అంటే రూ. 78.20 కోట్లు పైగా లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 15.47 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 7.97 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

పుష్ప రికార్డును బ్రేక్ చేసింది
'విక్రమ్' మూవీకి ఆరంభం నుంచే భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఇలా ఇప్పటికే రూ. 363.80 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. దీంతో అల్లు అర్జున్ 'పుష్ప' రికార్డును (357 కోట్లు గ్రాస్) బ్రేక్ చేసింది. అలాగే, ఇప్పటికే తమిళనాడులో ఎక్కువ గ్రాస్‌ను, షేర్‌ను వసూలు చేసిన సినిమాగానూ 'బాహుబలి 2' రికార్డును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











