Vikram 2 Days Collections: బాక్సాఫీస్‌పై కమల్ దండయాత్ర.. 2 రోజుల్లోనే షాకింగ్‌గా.. తెలుగులో ఇలా!
దాదాపు నలభై సంవత్సరాలుగా దక్షిణాదిలోనే కాకుండా దేశం మొత్తం గర్వించే కథానాయకుడిగా వెలుగొందుతూ సత్తా చాటుతోన్నారు విశ్వనాయకుడు కమల్ హాసన్. కెరీర్ ఆరంభంలోనే సహజ సిద్ధమైన నటనతో ఎన్నో చిత్రాలను వన్ మ్యాన్ షోలుగా మార్చేసిన ఆయన.. పదుల సంఖ్యలో విజయాలను అందుకున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం కమల్‌కు పెద్దగా సక్సెస్‌లు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో ఆయన నటించిన చిత్రమే 'విక్రమ్'. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా శుక్రవారమే విడుదలైంది. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో విక్రమ్ రెండు రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

విక్రమ్‌గా ఎంటరైన కమల్ హాసన్
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ రూపొందించిన చిత్రమే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. కొందరు ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్
'విక్రమ్' మూవీకి తమిళంలో రూ. 70 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 7 కోట్ల బిజినెస్ అయింది. హీరో నితిన్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశాడు. మిగిలిన భాషలు, ఏరియాలు కలిపి ఈ సినిమాకు రూ. 80 కోట్ల వరకూ వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.

2వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'విక్రమ్'కు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజూ మంచి రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 83 లక్షలు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.00 కోట్లు షేర్, రూ. 3.76 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకూ కలిపి ఎంతొచ్చింది
రెండు రోజుల్లోనూ ఏపీ, తెలంగాణలో 'విక్రమ్' హవా కనిపించింది. ఫలితంగా నైజాంలో రూ. 1.49 కోట్లు, సీడెడ్‌లో రూ. 51 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 56 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, వెస్ట్ గోదావ4రిలో రూ. 25 లక్షలు, గుంటూరులో రూ. 30 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 3.96 కోట్లు షేర్, రూ. 7.46 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా
ఆంధ్రా, తెలంగాణలో రెండు రోజుల్లో రూ. 3.96 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా రెండో రోజు రూ. 19.60 కోట్లు షేర్ రాబట్టింది. వీటితో కలిపి 2 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 50.80 కోట్లు షేర్‌తో పాటు రూ. 100.26 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బిజినెస్ టార్గెట్.. ఎంత రావాలి?
'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 80 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో దీనికి రూ. 7 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక, ఈ సినిమాకు రెండు రోజుల్లోనే రూ. 50.80 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ. 29.20 కోట్లు వసూలు కావాలి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 3.96 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 3.54 కోట్లు వసూలు కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











