Vikram 24 Days Collections: విక్రమ్‌కు సండే లక్.. అన్ని కోట్లతో రికార్డులు.. నితిన్‌కు కోట్ల లాభం

తమిళ చిత్ర పరిశ్రమ నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెట్టినా.. చాలా తక్కువ సమయంలోనే దక్షిణాదిలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు విశ్వనాయకుడు కమల్ హాసన్. విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో దాదాపు నలభై ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. చాలా కాలంగా విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'విక్రమ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ మంచి టాక్‌తో భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఫలితంగా భారీ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో 'విక్రమ్' 24 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూడండి!

విక్రమ్‌గా ఎంటరైన కమల్ హాసన్

విక్రమ్‌గా ఎంటరైన కమల్ హాసన్

కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

క్రేజీ కాంబోలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'విక్రమ్' మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర వ్యాపారం అయింది.

24వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

24వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


'విక్రమ్' మూవీకి తమిళంలో మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా అత్యధికంగా వస్తున్నాయి. దీంతో రెండు వారల్లోనే లాభాల బాటను అందుకుంది. ఈ నేపథ్యంలో 24వ రోజు దీనికి కలెక్షన్లు డబుల్ అవుతూ రూ. 32 లక్షలు వసూలు అయ్యాయి.

24 రోజులకూ కలిపి ఎంతొచ్చింది

24 రోజులకూ కలిపి ఎంతొచ్చింది

ఆంధ్రా, తెలంగాణలో 'విక్రమ్' 24 రోజుల్లోనూ భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 6.91 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.19 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.38 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.25 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 83 లక్షలు, గుంటూరులో రూ. 1.14 కోట్లు, కృష్ణాలో రూ. 1.32 కోట్లు, నెల్లూరులో రూ. 58 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 16.60 కోట్లు షేర్, రూ. 29.05 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

తెలుగు రాష్ట్రాల్లో 24 రోజుల్లో రూ. 16.60 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 24వ రోజు రూ. 2 కోట్లు పైగానే షేర్‌ను రాబట్టింది. వీటితో కలిపి 24 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కమల్ సినిమాకు రూ. 191.50 కోట్లు షేర్‌తో పాటు రూ. 385.65 కోట్లు గ్రాస్ వసూలైంది.

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 24 రోజుల్లోనే రూ. 184.55 కోట్లు వచ్చాయి. అంటే రూ. 90.50 కోట్లు పైగా లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 16.11 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 9.10 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

400, 200 మార్కుకు చేరువగానే

400, 200 మార్కుకు చేరువగానే


ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'విక్రమ్' మూవీ రూ. 400 గ్రాస్‌ను చేరుకునేందుకు చేరువగా వచ్చింది. ఇదే జరిగితే తమిళంలో 'రోబో 2.0' రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఈ సినిమా రూ. 200 షేర్‌ మార్కును కూడా చేరుకోడానికి రెడీగా ఉంది. ఈ రెండు మైలురాళ్లను చేరుకుంటే తమిళంలో ఇది టాప్ ప్లేస్‌కు చేరుకుంటుందని ట్రేడ్ వర్గాల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X