Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Vikram 25 Days Collections: విక్రమ్‌కు కలిసి రాని మండే.. అయినా ఎన్ని కోట్ల లాభమంటే?
దక్షిణాదిలోనే స్టార్‌గా ఉన్న విశ్వనాయకుడు కమల్ హాసన్ చాలా కాలంగా విజయాన్ని అందుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల 'విక్రమ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా అనేక రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో 'విక్రమ్' 25 రోజుల్లో ఎంత వసూలు చేసిందో బాక్స్ ఆఫీసు రిపోర్టులో చూద్దాం!
మంచి రెస్పాన్స్
కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'విక్రమ్'. ఈ సినిమాలో ఆయనతో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్యలు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ తో సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.
తెలుగు రాష్ట్రాల్లో 25వ రోజు
'విక్రమ్' సినిమాకు తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకు బిజినెస్ జరగగా తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండటంతో ఆంధ్ర, తెలంగాణలో 7 కోట్లకు హీరో నితిన్ హక్కులను కొనుగోలు చేశాడు. 'విక్రమ్' మూవీకి తమిళ్ లో మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కింది. ఈ నేపథ్యంలో 25వ రోజు కలెక్షన్లు తగ్గాయి. సోమవారం నాడు కేవలం 15 లక్షలు వసూలు అయ్యాయి.
25 రోజులకు గాను
ఆంధ్రా, తెలంగాణలో 'విక్రమ్' 25 రోజుల్లోనూ భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 6.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.21 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.40 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.26 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.15 కోట్లు, కృష్ణాలో రూ. 1.34 కోట్లు, నెల్లూరులో రూ. 58 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 16.75 కోట్లు షేర్, రూ. 29.30 కోట్లు గ్రాస్ దక్కింది.
9.25 కోట్ల ప్రాఫిట్
ఇక తెలుగు రాష్ట్రాల్లో 24 రోజుల్లో రూ.16.75 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటడంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 25 రోజులకు 194.25 కోట్లు షేర్‌తో పాటు రూ. 391.00 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇక తెలుగులో సినిమాకు 9.25 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.
రికార్డులు బద్దలు
అలాగే 400 కోట్ల గ్రాస్‌కు, 200 షేర్ మార్కుకు చేరువయింది. అదే జరిగితే తమిళంలో 'రోబో 2.0' రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ రెండు మైలురాళ్లను చేరుకుంటే తమిళంలో ఇది టాప్ ప్లేస్‌కు చేరుకుంటుంది. ఇప్పటికే బాహుబలి రికార్డులు ఈ సినిమా బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.