Vikram 26 Days Collections: అన్ని కోట్లతో విక్రమ్ హవా.. మరో 5 కోట్లు వస్తే.. తెలుగులో మాత్రం!

పేరుకు తమిళ హీరోనే అయినా.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు విశ్వ నాయకుడు కమల్ హాసన్. కెరీర్ ఆరంభం నుంచీ విలక్షణమైన నటనను కనబరుస్తోన్న ఆయన.. విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. అయితే, కొంత కాలంగా కమల్‌కు సక్సెస్ మాత్రం దక్కట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన ఇటీవలే 'విక్రమ్' అనే సినిమాతో వచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో 'విక్రమ్' 26 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూడండి!

విక్రమ్‌గా కమల్ హాసన్ అరాచకం

విక్రమ్‌గా కమల్ హాసన్ అరాచకం

కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ రూపొందించిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చాడు.

 భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్


ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'విక్రమ్' మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

26వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

26వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'విక్రమ్' మూవీకి మిగిలిన ప్రాంతాల మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా అత్యధికంగా వస్తున్నాయి. దీంతో రెండు వారల్లోనే లాభాల బాటను అందుకుంది. ఈ నేపథ్యంలో 26వ రోజు మాత్రం దీనికి రూ. 11 లక్షలు వసూలు అయ్యాయి.

26 రోజులకూ కలిపి ఎంతొచ్చింది

26 రోజులకూ కలిపి ఎంతొచ్చింది

'విక్రమ్' ఆంధ్రా, తెలంగాణలో 26 రోజుల్లోనూ భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 7.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.23 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.42 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.26 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.16 కోట్లు, కృష్ణాలో రూ. 1.35 కోట్లు, నెల్లూరులో రూ. 59 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 16.86 కోట్లు షేర్, రూ. 29.50 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

26 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.86 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 26వ రోజు రూ. కోటి పైగానే షేర్‌ను రాబట్టింది. వీటితో కలిపి 26 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కమల్ సినిమాకు రూ. 195.30 కోట్లు షేర్‌తో పాటు రూ. 393.15 కోట్లు గ్రాస్ వసూలైంది.

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 26 రోజుల్లోనే రూ. 195.30 కోట్లు వచ్చాయి. అంటే రూ. 92.15 కోట్లు పైగా లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 16.86 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 9.36 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

మరో ఐదు కోట్లు వసూలు అయితే

మరో ఐదు కోట్లు వసూలు అయితే


కమల్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'విక్రమ్' మూవీ రూ. 4.70 కోట్లు వసూలు అయితే.. రూ. 200 కోట్లు షేర్ మార్కును చేరుకుంటుంది. అలాగే, రూ. 6.85 కోట్లు గ్రాస్ వసూలు అయితే.. రూ. 400 కోట్ల మైలురాయిని అందుకుంటుంది. అంతేకాదు, తెలుగులో ఈ సినిమాకు రూ. 64 లక్షలు వసూలు అయితే.. ఏకంగా పది కోట్ల రూపాయల లాభాలు సొంతం అవుతాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X