Vikram 29 Days Collections: విక్రమ్‌కు తొలి షాక్.. మొదటిసారి ఇంత తక్కువ.. అయినా అన్ని కోట్ల లాభం
ఈ మధ్య కాలంలో అన్ని ఇండస్ట్రీల్లోనూ పక్కా మాస్ మసాలా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటికి దేశ వ్యాప్తంగా ఆదరణ దక్కుతూ ఉండడంతో ఫిల్మ్ మేకర్లు అదే పంథాను ఫాలో అవుతున్నారు. ఇలా నాలుగు వారాల క్రితం విడుదలైన చిత్రమే 'విక్రమ్'. సుదీర్ఘ కాలంగా హిట్ కోసం వేచి చూస్తోన్న విశ్వ నాయకుడు కమల్ హాసన్ నటించిన ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా ఇది కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో రాబట్టింది. అయితే, రెండు మూడు రోజులుగా ఈ సినిమా వసూళ్లు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 'విక్రమ్' మూవీ 29వ రోజు ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

విక్రమ్‌గా రచ్చ చేసేసిన కమల్
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ రూపొందించిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్
క్రేజీ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'విక్రమ్' మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ దీని హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

29వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
తెలుగు రాష్ట్రాల్లోనూ కమల్ హాసన్‌కు భారీ మార్కెట్ ఉంది. అందుకు అనుగుణంగానే 'విక్రమ్' మన దగ్గర కూడా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే ఏపీ, తెలంగాణలోనూ దీనికి భారీ స్పందన దక్కింది. ఫలితంగా టార్గెట్ రీచ్ అవడంతో పాటు లాభాల పంట పండిస్తోంది. ఈ నేపథ్యంలో 29వ రోజు మాత్రం దీనికి రూ. 6 లక్షలు కలెక్ట్ అయ్యాయి.

29 రోజులకు కలిపి ఎంతొచ్చింది
29 రోజుల్లోనూ ఆంధ్రా, తెలంగాణలో 'విక్రమ్' భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 7.11 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.26 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.44 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.28 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.17 కోట్లు, కృష్ణాలో రూ. 1.38 కోట్లు, నెల్లూరులో రూ. 62 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.10 కోట్లు షేర్, రూ. 30.05 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా
తెలుగు రాష్ట్రాల్లో 29 రోజుల్లో రూ. 17.10 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 28వ రోజు రూ. 60 లక్షలు షేర్‌ను రాబట్టింది. వీటితో కలిపి 29 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కమల్ సినిమాకు రూ. 197.45 కోట్లు షేర్‌తో పాటు రూ. 397.30 కోట్లు గ్రాస్ వసూలైంది.

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?
'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 29 రోజుల్లోనే రూ. 197.45 కోట్లు వచ్చాయి. అంటే రూ. 96.45 కోట్లు వరకూ లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 17.10 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 9.60 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.


Click it and Unblock the Notifications











