Vikram 3 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. 3 రోజుల్లోనే అన్ని కోట్లా.. తెలుగులో షాకింగ్‌గా!

కమల్ హాసన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఆయన దాదాపు నలభై ఏళ్లుగా సౌతిండియా మొత్తంలో హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాదు, ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వెళ్తున్నారు. కానీ, కొంత కాలంగా ఆయన పెద్దగా విజయాలను మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఫుల్ మాస్ యాక్షన్ మూవీ 'విక్రమ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం.. ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'విక్రమ్' మూడు రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

విక్రమ్‌గా కమల్ హాసన్ అరాచకం

విక్రమ్‌గా కమల్ హాసన్ అరాచకం

విశ్వ నాయకుడు కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కలయికలో వచ్చిన చిత్రమే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. ఇది జూన్ 3న గ్రాండ్‌గా విడుదలైంది.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

తమిళంలో 'విక్రమ్' మూవీకి రూ. 70 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమాకు ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్ల బిజినెస్ అయింది. హీరో నితిన్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశాడు. మిగిలిన భాషలు, ఏరియాలు కలిపి ఈ సినిమాకు రూ. 80 కోట్ల వరకూ వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

3వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

3వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


మూడో రోజూ 'విక్రమ్'కు తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 96 లక్షలు, సీడెడ్‌లో రూ. 40 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 36 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 24 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 19 లక్షలు, కృష్ణాలో రూ. 17 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.59 కోట్లు షేర్, రూ. 4.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజులకూ కలిపి ఎంతొచ్చింది

3 రోజులకూ కలిపి ఎంతొచ్చింది

ఏపీ, తెలంగాణలో 'విక్రమ్' మూడు రోజుల్లోనూ హవా చూపించింది. ఫలితంగా నైజాంలో రూ. 2.46 కోట్లు, సీడెడ్‌లో రూ. 91 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 94 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 59 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, గుంటూరులో రూ. 49 లక్షలు, కృష్ణాలో రూ. 45 లక్షలు, నెల్లూరులో రూ. 31 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 6.55 కోట్లు షేర్, రూ. 12.26 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల్లో రూ. 6.55 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా మూడో రోజు రూ. 25.05 కోట్లు షేర్ రాబట్టింది. వీటితో కలిపి 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 75.85 కోట్లు షేర్‌తో పాటు రూ. 150.28 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బిజినెస్ టార్గెట్.. ఎంత రావాలి?

బిజినెస్ టార్గెట్.. ఎంత రావాలి?

'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 80 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో దీనికి రూ. 7 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక, ఈ సినిమాకు మూడు రోజుల్లోనే రూ. 75.85 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ. 4.15 కోట్లు వసూలు కావాలి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 6.55 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 95 లక్షలు వసూలు కావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X