Vikram 30 Days Collections: మళ్లీ పెరిగిన కలెక్షన్లు.. 30 రోజూ ఈ రేంజ్‌లో.. లాభం ఎన్ని కోట్లంటే!

దాదాపు నలభై ఏళ్లుగా తనదైన శైలి విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో దక్షిణ భారతదేశంలోనే గొప్ప నటుడిగా వెలుగొందుతోన్నారు విశ్వ నాయకుడు కమల్ హాసన్. ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఉత్తమ నటుడిగా నిలిచిన ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం విజయాలను అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కమల్ ఇటీవలే 'విక్రమ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. దీనికి అన్ని వర్గాల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'విక్రమ్' మూవీ 30 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

విక్రమ్‌గా కమల్ హాసన్ విశ్వరూపం

విక్రమ్‌గా కమల్ హాసన్ విశ్వరూపం


కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ రూపొందించిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని ఇచ్చాడు.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'విక్రమ్' మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ దీని హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర బిజినెస్‌ అయింది.

30వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

30వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

కమల్ హాసన్‌కు తమిళనాడులో మాదిరిగానే ఆంధ్రా, తెలంగాణలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకు అనుగుణంగానే 'విక్రమ్' మన దగ్గర కూడా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే ఏపీ, తెలంగాణలోనూ దీనికి భారీ స్పందన దక్కింది. ఫలితంగా లాభాల పంట పండిస్తోంది. ఈ నేపథ్యంలో 30వ రోజు కాస్త పెరిగి దీనికి రూ. 8 లక్షలు కలెక్ట్ అయ్యాయి.

30 రోజులకు కలిపి ఎంతొచ్చింది

30 రోజులకు కలిపి ఎంతొచ్చింది

ఆంధ్రా, తెలంగాణలో 'విక్రమ్' 30 రోజుల్లోనూ భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 7.13 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.28 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 85 లక్షలు, గుంటూరులో రూ. 1.17 కోట్లు, కృష్ణాలో రూ. 1.39 కోట్లు, నెల్లూరులో రూ. 62 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.17 కోట్లు షేర్, రూ. 30.10 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

తెలుగు రాష్ట్రాల్లో 30 రోజుల్లో రూ. 17.17 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా శనివారం రూ. 78 లక్షలు షేర్‌ను రాబట్టింది. వీటితో కలిపి 30 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కమల్ సినిమాకు రూ. 198.28 కోట్లు షేర్‌తో పాటు రూ. 399.20 కోట్లు గ్రాస్ వసూలైంది.

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?


'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 30 రోజుల్లోనే రూ. 198.28 కోట్లు వచ్చాయి. అంటే రూ. 97 కోట్లు వరకూ లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 17.17 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 9.67 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X