Vikram 31 Days Collections: విక్రమ్ సరికొత్త చరిత్ర.. ఒకేరోజు రెండు రికార్డులు.. లాభం అన్ని కోట్లా!

కమల్ హాసన్.. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ సీనియర్ హీరో సుదీర్ఘ కాలంగా తనదైన శైలి విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అదే సమయంలో ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా చిత్రాలు చేస్తూనే ఉన్నారు.

ఇక, దాదాపు ఎనిమిదేళ్లుగా విజయాన్ని అందుకోలేకపోయిన కమల్.. ఇటీవలే 'విక్రమ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 31వ రోజు కూడా దీనికి కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం? ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టును మీరూ చూడండి!

విక్రమ్‌గా కమల్ హాసన్ అరాచకం

విక్రమ్‌గా కమల్ హాసన్ అరాచకం

విశ్వ నాయకుడు కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'విక్రమ్' మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ దీని హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర బిజినెస్‌ జరిగింది.

 31వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

31వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

కమల్ హాసన్‌కు దక్షిణాది మొత్తం భారీ ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రా, తెలంగాణలో ఆయన చిత్రాలకు ఆదరణ దక్కుతోంది. అందుకు అనుగుణంగానే 'విక్రమ్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో కొన్ని రోజులుగా లాభాల పంట పండిస్తోంది. ఈ నేపథ్యంలో 31వ రోజు కాస్త పెరిగి దీనికి రూ. 12 లక్షలు వచ్చాయి.

31 రోజులకు కలిపి ఎంతొచ్చింది

31 రోజులకు కలిపి ఎంతొచ్చింది

'విక్రమ్' ఆంధ్రా, తెలంగాణలో 31 రోజుల్లోనూ భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 7.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.29 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.48 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.29 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.18 కోట్లు, కృష్ణాలో రూ. 1.41 కోట్లు, నెల్లూరులో రూ. 61 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.28 కోట్లు షేర్, రూ. 30.30 కోట్లు గ్రాస్ దక్కింది.

 ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

31 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.28 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా ఆదివారం రూ. 2.15 కోట్లు షేర్‌ను రాబట్టింది. వీటితో కలిపి 31 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కమల్ సినిమాకు రూ. 201.00 కోట్లు షేర్‌తో పాటు రూ. 404.10 కోట్లు గ్రాస్ వసూలైంది.

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా 'విక్రమ్' మూవీకి రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 31 రోజుల్లోనే రూ. 201.00 కోట్లు వచ్చాయి. అంటే రూ. 100 కోట్లు వరకూ లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 17.28 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 9.78 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

ఒకే రోజు రెండు రికార్డులు సొంతం

ఒకే రోజు రెండు రికార్డులు సొంతం

కమల్ హాసన్ హీరోగా నటించిన 'విక్రమ్' మూవీకి 31వ రోజైన ఆదివారం కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఈ సినిమా ఒకేరోజు రూ. 200 షేర్, రూ. 400 గ్రాస్ మార్కును దాటేసింది. ఫలితంగా ఈ ఘనతను అందుకున్న అతి తక్కువ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు, తమిళనాడులో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన రెండో మూవీగా 'విక్రమ్' సరికొత్త రికార్డును నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X