Vikram 33 Days Collections: 33వ రోజూ విక్రమ్ హవా.. అప్పుడే అన్ని కోట్లు.. టోటల్ లాభమెంతో తెలిస్తే!

దాదాపు నలభై ఏళ్లుగా దక్షిణాది రాష్ట్రాల్లో హవాను చూపిస్తూ బడా స్టార్ హీరోగా వెలుగొందుతోన్నారు విశ్వ నాయకుడు కమల్ హాసన్. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి విలక్షణమైన నటనను కనబరుస్తూ.. విభిన్నమైన చిత్రాలతో అలరిస్తోన్న ఆయన.. చాలా కాలంగా విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే కమల్ 'విక్రమ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. ఫలితంగా ఈ మూవీ కలెక్షన్లను అత్యధికంగా రాబట్టింది. దీంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'విక్రమ్' 33 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

విక్రమ్‌గా కమల్ హాసన్ విశ్వరూపం

విక్రమ్‌గా కమల్ హాసన్ విశ్వరూపం

సీనియర్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ తీసిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'విక్రమ్' మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ దీని హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర బిజినెస్‌ అయింది.

33వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

33వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. కమల్ హాసన్‌ చిత్రాలకు ఆంధ్రా, తెలంగాణలో భారీ ఆదరణ దక్కుతోంది. అందుకు అనుగుణంగానే 'విక్రమ్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో కొన్ని రోజులుగా లాభాల పంట పండిస్తోంది. ఈ నేపథ్యంలో 33వ రోజు కాస్త తగ్గి దీనికి రూ. 5 లక్షలు వచ్చాయి.

33 రోజులకు కలిపి ఎంతొచ్చింది

33 రోజులకు కలిపి ఎంతొచ్చింది

ఆంధ్రా, తెలంగాణలో 'విక్రమ్' 33 రోజుల్లోనూ భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 7.23 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.31 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.50 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.29 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.19 కోట్లు, కృష్ణాలో రూ. 1.43 కోట్లు, నెల్లూరులో రూ. 61 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.40 కోట్లు షేర్, రూ. 30.52 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

తెలుగు రాష్ట్రాల్లో 33 రోజుల్లోనే రూ. 17.40 కోట్లు రాబట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా ఆదివారం రూ. 80 లక్షలు షేర్‌ను రాబట్టింది. వీటితో కలిపి 33 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కమల్ సినిమాకు రూ. 203.10 కోట్లు షేర్‌తో పాటు రూ. 408.02 కోట్లు గ్రాస్ వసూలైంది.

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 33 రోజుల్లోనే రూ. 203.10 కోట్లు వచ్చాయి. అంటే రూ. 103 కోట్లు వరకూ లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 17.40 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 9.90 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X