Don't Miss!
- News
టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
- Sports
లక్నో ఫ్రాంచైజీ గ్రూప్ కొన్న జట్టు తరఫున సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడబోయే స్టార్లు వీరే..!
- Finance
Investments: చైనా, తైవాన్లలో పెట్టుబడులు పెట్టిన దేశీయ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు.. ఎందుకంటే..
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
- Technology
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల డేటాను ట్రాక్ చేస్తోంది!!
- Lifestyle
మీ జుట్టు ఒత్తుగా లేదా మెరుస్తూ ఉండాలనుకుంటున్నారా? వీటిని ఉపయోగించండి...
- Automobiles
బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి Swift CNG విడుదల, ధర రూ.7.77 లక్షలు
Vikram 34 Days Collections: వసూళ్లు డౌన్.. ఓవరాల్‌గా అన్ని కోట్లు.. నితిన్‌కి లాభమెంతో తెలుసా!
విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో సుదీర్ఘ కాలంగా దక్షిణాదిలోని సినీ ప్రియులను అలరిస్తూ దిగ్గజ నటుడిగా వెలుగొందుతోన్నారు విశ్వనాయకుడు కమల్ హాసన్. కెరీర్ ఆరంభం నుంచి చాలా కాలం పాటు వరుసగా విజయాలను అందుకున్న ఆయన.. దాదాపు ఎనిమిదేళ్లుగా ఒక్క హిట్‌ను కూడా ఖాతాలో వేసుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లోనే గత నెలలో 'విక్రమ్' అనే సినిమాలో నటించారు.
విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. దీనికి అన్ని ఏరియాల్లోనూ భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'విక్రమ్' 34 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

విక్రమ్‌గా రచ్చ చేసేసిన కమల్
విశ్వనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీనే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు.
నాగబాబుకు ఫేమస్ కమెడియన్ వార్నింగ్: ఏమనుకుంటున్నావ్.. ఇది కరెక్ట్ కాదు అంటూ!

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్
క్రేజీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'విక్రమ్' మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ దీని హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

34వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
కమల్ హాసన్‌కు దక్షిణాదిలోని అన్ని ప్రాంతాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకు అనుగుణంగానే 'విక్రమ్' మూవీ అన్ని చోట్లా భారీ స్పందన దక్కింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో 34వ రోజు మాత్రం ప్రేక్షకాదరణ తగ్గిపోయి ఈ సినిమాకు రూ. 4 లక్షలే కలెక్ట్ అయ్యాయి.
మళ్లీ రెచ్చిపోయిన తెలుగు యాంకర్: చీరలోనూ హాట్‌గా.. ఈ వీడియో చూశారంటే!

34 రోజులకు కలిపి ఎంతొచ్చింది
'విక్రమ్' 34 రోజుల్లోనూ ఆంధ్రా, తెలంగాణలో భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 7.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.32 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.51 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.29 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.19 కోట్లు, కృష్ణాలో రూ. 1.44 కోట్లు, నెల్లూరులో రూ. 61 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.44 కోట్లు షేర్, రూ. 30.60 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా
34 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.44 కోట్లు రాబట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 34వ రోజు రూ. 50 లక్షలు పైగా షేర్‌ను రాబట్టింది. వీటితో కలిపి 34 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కమల్ సినిమాకు రూ. 203.65 కోట్లు షేర్‌తో పాటు రూ. 409.00 కోట్లు గ్రాస్ వసూలైంది.
సుమ షోలో యంగ్ హీరోకు అవమానం: మొబైల్ విసిరేసిన యాంకర్.. కోపంతో వెళ్లిపోయిన స్టార్ కిడ్

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?
ప్రపంచ వ్యాప్తంగా 'విక్రమ్' మూవీకి రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 34 రోజుల్లోనే రూ. 203.65 కోట్లు వచ్చాయి. అంటే రూ. 103 కోట్లు పైగా లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 17.44 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 9.94 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.