twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vikram 36 Days Collections: తెలుగులో విక్రమ్ రికార్డు.. నితిన్‌కు అన్ని కోట్ల లాభాలు

    |

    దాదాపు నలభై ఏళ్లుగా దక్షిణాది భాషలు అన్నింట్లోనూ తన హవాను చూపిస్తూ.. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న హీరోల్లో విశ్వనాయకుడు కమల్ హాసన్ ఒకరు. విలక్షణమైన నటన, విభిన్నమైన నేపథ్యాలతో సినిమాలు చేస్తోన్న ఆయన.. చాలా ఏళ్లుగా విజయాన్ని అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి పక్కాగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో 'విక్రమ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా టాక్ పరంగా, కలెక్షన్ల పరంగా విజయవంతం అయింది. దీంతో ఇప్పటికీ వసూళ్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'విక్రమ్' 36 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

     విక్రమ్‌గా కమల్ హాసన్ విశ్వరూపం

    విక్రమ్‌గా కమల్ హాసన్ విశ్వరూపం


    విశ్వనాయకుడు కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు.

    డ్రెస్ ఉన్నా లేనట్లే మలైకా హాట్ ట్రీట్: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!డ్రెస్ ఉన్నా లేనట్లే మలైకా హాట్ ట్రీట్: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

     భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

    భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్


    ఫుల్ లెంగ్త్ మాస్ మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'విక్రమ్'కు తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ దీని హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర బిజినెస్‌ జరిగింది.

    36వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    36వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


    కోలీవుడ్ సీనియర్ హీరో కమల్ హాసన్‌కు తమిళనాడులో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే 'విక్రమ్' మూవీని ఇక్కడ కూడా భారీగా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమా స్పందన భారీగా వచ్చింది. దీంతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 36వ రోజు మాత్రం దీనికి కేవలం రూ. 3 లక్షలే వసూలు అయ్యాయి.

    ఫ్యాషన్‌ షోలో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్: వామ్మో ఇదేం డ్రెస్‌రా నాయనా!ఫ్యాషన్‌ షోలో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్: వామ్మో ఇదేం డ్రెస్‌రా నాయనా!

    36 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    36 రోజులకు కలిపి ఎంతొచ్చింది


    'విక్రమ్' 36 రోజుల్లోనూ ఆంధ్రా, తెలంగాణలో భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 7.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.33 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.52 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.29 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.20 కోట్లు, కృష్ణాలో రూ. 1.45 కోట్లు, నెల్లూరులో రూ. 61 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.50 కోట్లు షేర్, రూ. 30.70 కోట్లు గ్రాస్ దక్కింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా


    36 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.50 కోట్లు రాబట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 36వ రోజు రూ. 43 లక్షలు షేర్‌ను రాబట్టింది. వీటితో కలిపి 36 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కమల్ సినిమాకు రూ. 204.83 కోట్లు షేర్‌తో పాటు రూ. 410.90 కోట్లు గ్రాస్ వసూలైంది.

    బీచ్‌లో లోదుస్తుల్లో యాంకర్ స్రవంతి రచ్చ: తడిచిన అందాలతో ఘోరంగా!బీచ్‌లో లోదుస్తుల్లో యాంకర్ స్రవంతి రచ్చ: తడిచిన అందాలతో ఘోరంగా!

    బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

    బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?


    'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 36 రోజుల్లోనే రూ. 204.83 కోట్లు వచ్చాయి. అంటే రూ. 104 కోట్లు పైగా లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 17.50 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 10.00 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

    English summary
    Kollywood Star Kamal Haasan Did Vikram Movie Under Lokesh Kanagaraj Direction. This Movie Collect 204.83 Cr in 36 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X