Vikram 37 Days Collections: ఏమాత్రం తగ్గని కమల్ హవా.. 37వ రోజు కూడా ఓ రేంజ్ వసూళ్లు
కమల్ హాసన్.. ఈ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఆయన దాదాపు నలభై ఏళ్లుగా దక్షిణాదిలోని అన్ని సినీ పరిశ్రమల్లో హవాను చూపిస్తూ బడా స్టార్‌గా వెలుగొందుతోన్నారు. అంతేకాదు, విభిన్నమైన చిత్రాలను చేస్తూ విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఆరు పదుల వయసులోనూ తనదైన చిత్రాలతో ఆయన సందడి చేస్తున్నారు. కానీ, ఈ మధ్య కాలంలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే కమల్ 'విక్రమ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా టాక్ పరంగా, కలెక్షన్ల పరంగా సత్తా చాటింది. ఈ నేపథ్యంలో 'విక్రమ్' 37 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

విక్రమ్‌గా కమల్ హాసన్ అరాచకం
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్
పూర్తి స్థాయి మాస్ మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'విక్రమ్'కు తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ దీని హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర బిజినెస్ అయింది.

37వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
విశ్వనాయకుడు కమల్ హాసన్‌కు తమిళనాడులో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే 'విక్రమ్' మూవీని ఇక్కడ కూడా భారీగా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమా స్పందన భారీగా వచ్చింది. దీంతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 37వ రోజు మాత్రం దీనికి కేవలం రూ. 5 లక్షలే వసూలు అయ్యాయి.

37 రోజులకు కలిపి ఎంతొచ్చింది
37 రోజుల్లోనూ 'విక్రమ్' ఆంధ్రా, తెలంగాణలో భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 7.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.35 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.52 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.29 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.19 కోట్లు, కృష్ణాలో రూ. 1.47 కోట్లు, నెల్లూరులో రూ. 61 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.55 కోట్లు షేర్, రూ. 30.80 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా
తెలుగు రాష్ట్రాల్లో 37 రోజుల్లోనే రూ. 17.55 కోట్లు రాబట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 37వ రోజు రూ. 40 లక్షలు షేర్‌ను రాబట్టింది. వీటితో కలిపి 37 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కమల్ సినిమాకు రూ. 205.25 కోట్లు షేర్‌తో పాటు రూ. 411.80 కోట్లు గ్రాస్ వసూలైంది.

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?
'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 37 రోజుల్లోనే రూ. 205.25 కోట్లు వచ్చాయి. అంటే రూ. 105 కోట్లు పైగా లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 17.55 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 10.05 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.


Click it and Unblock the Notifications











