Vikram 4 Weeks Collections: 100 కోట్ల బిజినెస్.. 4 వారాల్లోనే షాకింగ్‌గా.. తెలుగులో లాభం ఎంతంటే!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియాలోని అన్ని వర్గాల ప్రేక్షకులను తనదైన శైలి నటనతో అలరిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతోన్నారు విశ్వనాయకుడు కమల్ హాసన్. ఆరంభం నుంచే విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తోన్న ఆయనకు.. దాదాపు ఎనిమిదేళ్లుగా హిట్ అనేది దక్కలేదు. అయినప్పటికీ వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే కమల్ 'విక్రమ్' అనే సినిమాతో వచ్చారు. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఆరంభం నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'విక్రమ్' 4 వారాల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

విక్రమ్‌గా ఎంట్రీ ఇచ్చేసిన కమల్

విక్రమ్‌గా ఎంట్రీ ఇచ్చేసిన కమల్

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ రూపొందిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'విక్రమ్' మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 100 కోట్ల మేర బిజినెస్‌ను చేసుకుంది.

28వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

28వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


కమల్ హాసన్‌కు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ మార్కెట్ ఉంది. అందుకు అనుగుణంగానే 'విక్రమ్' మన దగ్గర కూడా గ్రాండ్‌గా విడుదలైంది. అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే ఏపీ, తెలంగాణలోనూ దీనికి అనూహ్య స్పందన దక్కింది. ఫలితంగా టార్గెట్ రీచ్ అవడంతో పాటు లాభాల పంట పండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో 28వ రోజు మాత్రం దీనికి రూ. 8 లక్షలు కలెక్ట్ అయ్యాయి.

4 వారాలకూ కలిపి ఎంతొచ్చింది

4 వారాలకూ కలిపి ఎంతొచ్చింది

4 వారాల్లోనూ ఆంధ్రా, తెలంగాణలో 'విక్రమ్' భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 7.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.44 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.28 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.16 కోట్లు, కృష్ణాలో రూ. 1.38 కోట్లు, నెల్లూరులో రూ. 61 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.04 కోట్లు షేర్, రూ. 29.85 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా


తెలుగు రాష్ట్రాల్లో 4 వారాల్లో రూ. 17.04 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 28వ రోజు రూ. 65 లక్షలు షేర్‌ను రాబట్టింది. వీటితో కలిపి 4 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కమల్ సినిమాకు రూ. 196.85 కోట్లు షేర్‌తో పాటు రూ. 396.30 కోట్లు గ్రాస్ వసూలైంది.

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 4 వారాల్లోనే రూ. 196.85 కోట్లు వచ్చాయి. అంటే రూ. 95.85 కోట్లు వరకూ లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 17.04 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 9.54 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X