Vikram 5 Weeks Collections: 100 కోట్ల బిజినెస్.. 5 వారాల్లోనే అన్ని కోట్లు.. టోటల్ లాభం ఎంతంటే!

పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. దక్షిణాది మొత్తం క్రేజ్‌ను ఏర్పరచుకుని బడా స్టార్‌గా వెలుగొందుతోన్నారు విశ్వనాయకుడు కమల్ హాసన్. విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న ఆయన.. ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్నారు. అయితే, దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ సీనియర్ హీరోకు విజయం అందకుండానే పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమల్ ఇటీవలే 'విక్రమ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది టాక్ పరంగా, కలెక్షన్ల పరంగా ఎవరూ ఊహించని రీతిలో విజయవంతం అయింది. దీంతో ఇప్పటికీ వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'విక్రమ్' 5 వారాల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

విక్రమ్‌గా కమల్ హాసన్ అరాచకం

విక్రమ్‌గా కమల్ హాసన్ అరాచకం


కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ రూపొందించిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

వినూత్న కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'విక్రమ్' మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ దీని హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర బిజినెస్‌ అయింది.

35వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

35వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


విశ్వ నాయకుడు కమల్ హాసన్‌కు తమిళనాడులో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే 'విక్రమ్' మూవీని ఇక్కడ కూడా భారీగా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమా స్పందన భారీగా వచ్చింది. దీంతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 35వ రోజు మాత్రం దీనికి కేవలం రూ. 3 లక్షలే వసూలు అయ్యాయి.

5 వారాలకు కలిపి ఎంతొచ్చింది

5 వారాలకు కలిపి ఎంతొచ్చింది

'విక్రమ్' 5 వారాల్లోనూ ఆంధ్రా, తెలంగాణలో భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 7.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.33 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.51 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.29 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.19 కోట్లు, కృష్ణాలో రూ. 1.45 కోట్లు, నెల్లూరులో రూ. 61 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.47 కోట్లు షేర్, రూ. 30.65 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా


5 వారాల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.47 కోట్లు రాబట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 35వ రోజు రూ. 75 లక్షలు షేర్‌ను రాబట్టింది. వీటితో కలిపి 5 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కమల్ సినిమాకు రూ. 204.40 కోట్లు షేర్‌తో పాటు రూ. 410.10 కోట్లు గ్రాస్ వసూలైంది.

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 5 వారాల్లోనే రూ. 204.40 కోట్లు వచ్చాయి. అంటే రూ. 104 కోట్లు పైగా లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 17.47 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 9.97 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X