Vikram 6 Days Collections: ఆరో రోజూ అదే బాదుడు.. అప్పుడే అన్ని కోట్లు.. లాభాలు ఎంతో తెలిస్తే!

తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి పరిచయం అయినా.. చాలా తక్కువ సమయంలోనే దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుని అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందారు విశ్వ నాయకుడు కమల్ హాసన్. సుదీర్ఘ కాలంగా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే, కొంత కాలంగా ఆయనకు సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి భారీ హిట్ కొట్టాలనుకున్న కమల్ 'విక్రమ్' మూవీతో వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అదే రీతిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'విక్రమ్' ఆరు రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

విక్రమ్‌గా కమల్ హాసన్ సందడి

విక్రమ్‌గా కమల్ హాసన్ సందడి


సీనియర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ రూపొందించిన చిత్రమే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. ఇది జూన్ 3న భారీగా విడుదలైంది.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్


'విక్రమ్' మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 90 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమాకు ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్ల బిజినెస్ అయింది. హీరో నితిన్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల వరకూ వ్యాపారం జరిగింది.

6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'విక్రమ్' మూవీకి ఆరో రోజూ తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 51 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.05 కోట్లు షేర్, రూ. 1.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

6 రోజులకూ కలిపి ఎంతొచ్చింది

6 రోజులకూ కలిపి ఎంతొచ్చింది


ఆంధ్రా, తెలంగాణలో 'విక్రమ్' 6 రోజుల్లోనూ బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 4.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.35 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 80 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 54 లక్షలు, గుంటూరులో రూ. 70 లక్షలు, కృష్ణాలో రూ. 73 లక్షలు, నెల్లూరులో రూ. 39 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 10.23 కోట్లు షేర్, రూ. 18.46 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా

తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల్లో రూ. 10.23 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 6వ రోజు రూ. 8.60 కోట్లు షేర్ రాబట్టింది. వీటితో కలిపి ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 114.10 కోట్లు షేర్‌తో పాటు రూ. 226.71 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బిజినెస్ టార్గెట్.. ఎంత రావాలి?

బిజినెస్ టార్గెట్.. ఎంత రావాలి?


'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో దీనికి రూ. 7 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక, ఈ సినిమాకు 6 రోజుల్లోనే రూ. 114.10 కోట్లు వచ్చాయి. అంటే రూ. 14 కోట్లు పైగా లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 10.23 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 2.73 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X