Vikram 8 Days Collections: 8వ రోజు బిగ్ డ్రాప్.. అక్కడ మాత్రం షాకింగ్‌గా.. నితిన్‌కు ఎంత లాభమంటే!
విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలో తన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నారు విశ్వనాయకుడు కమల్ హాసన్. కెరీర్ ఆరంభంలోనే గొప్ప గొప్ప చిత్రాలతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందిన ఆయన.. కొంత కాలంగా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటోన్నారు. దీంతో ఈ సారి ఎలాగైనా విజయాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో కనిపించారు. ఇందులో భాగంగానే ఇటీవలే 'విక్రమ్' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ సూపర్ సక్సెస్ అయింది. దీంతో కలెక్షన్లు కూడా పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'విక్రమ్' ఎనిమిది రోజుల్లో ఎంత వసూలు చేసిందో ఓ లుక్కేద్దాం పదండి!

విక్రమ్‌గా కమల్ హాసన్ అరాచకం
విశ్వ నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ రూపొందించిన చిత్రమే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ఇటీవలే గ్రాండ్‌గా విడుదలైంది.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్
కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 90 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమాకు ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్ల బిజినెస్ అయింది. హీరో నితిన్ ఈ సినిమా హక్కులను కొన్నాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర వ్యాపారం జరిగింది.

8వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'విక్రమ్' మూవీకి 8వ రోజూ తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 28 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 58 లక్షలు షేర్, రూ. 90 లక్షలు గ్రాస్ వచ్చింది.

8 రోజులకూ కలిపి ఎంతొచ్చింది
'విక్రమ్' 8 రోజుల్లోనూ ఆంధ్రా, తెలంగాణలో బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 4.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.54 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.68 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 88 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 59 లక్షలు, గుంటూరులో రూ. 78 లక్షలు, కృష్ణాలో రూ. 84 లక్షలు, నెల్లూరులో రూ. 42 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 11.70 కోట్లు షేర్, రూ. 20.81 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా
తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో రూ. 11.70 కోట్లు కొల్లగొట్టిన 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 8వ రోజు రూ. 6.40 కోట్లు షేర్ రాబట్టింది. వీటితో కలిపి 8 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 127.50 కోట్లు షేర్‌తో పాటు రూ. 254.01 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?
'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 8 రోజుల్లోనే రూ. 127.50 కోట్లు వచ్చాయి. అంటే రూ. 27 కోట్లు పైగా లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 11.70 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 4.20 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.


Click it and Unblock the Notifications











