Vikram Closing Collections: 7 కోట్లకు కొన్న నితిన్.. ఫుల్‌ రన్‌లో భారీగా.. లాభమే అన్ని కోట్లా!

దాదాపు నలభై ఏళ్లుగా దక్షిణాది మొత్తంగా హవాను చూపిస్తూ.. స్టార్ హీరోగా వెలుగొందుతోన్నారు విశ్వ నాయకుడు కమల్ హాసన్. ఏజ్ బార్ అవుతోన్న ఏమాత్రం వెనక్కి తగ్గని ఈ స్టార్ హీరో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే, దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ సీనియర్ హీరోకు విజయాలు మాత్రం అస్సలు దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రోజుల క్రితం కమల్ 'విక్రమ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో తెలుగులో 'విక్రమ్' బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

విక్రమ్‌గా కమల్ హాసన్ అరాచకం

విక్రమ్‌గా కమల్ హాసన్ అరాచకం

సీనియర్ హీరో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కలయికలో వచ్చిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు.

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్

పూర్తి స్థాయి మాస్ మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'విక్రమ్'కు తమిళం సహా పలు ఏరియాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తెలుగులో కూడా ఆయన రేంజ్‌కు తగ్గట్లుగానే థియేట్రికల్ హక్కులు భారీ ధర పలికాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మొత్తం ఏరియాలకు కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ దీని హక్కులను కొనుగోలు చేశాడు.

పాజిటివ్ టాక్... కలెక్షన్ల సునామీ

పాజిటివ్ టాక్... కలెక్షన్ల సునామీ


క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'విక్రమ్' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విశేషమైన స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. ఆ వెంటనే లాభాల బాటలోనూ పయనించింది. ఇలా క్లోజింగ్ వరకూ కమల్ హాసన్ విక్రమ్ సినిమా హవాను చూపిస్తూనే వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది

తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది

'విక్రమ్' ఫుల్ రన్‌లో ఆంధ్రా, తెలంగాణలో భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 7.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.38 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.55 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.32 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 86 లక్షలు, గుంటూరులో రూ. 1.22 కోట్లు, కృష్ణాలో రూ. 1.50 కోట్లు, నెల్లూరులో రూ. 62 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.80 కోట్లు షేర్, రూ. 31.40 కోట్లు గ్రాస్ దక్కింది.

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?

'విక్రమ్' మూవీ తెలుగు వెర్షన్‌కు సంబంధించిన హక్కులను టాలీవుడ్ యూత్ హీరో నితిన్ రూ. 7 కోట్లకు కొన్నాడు. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7.50 కోట్లగా నమోదైంది. ఇక, ఈ సినిమా ముగింపు సమయానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.80 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రానికి సంబంధించి హీరో నితిన్‌కు మొత్తం రూ. 10.30 కోట్ల మేర లాభాలు సొంతమయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా సెంచరీ చేసి

ప్రపంచ వ్యాప్తంగా సెంచరీ చేసి


తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా రూ. 17.80 కోట్లు వసూలు చేసిన 'విక్రమ్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇలా మొత్తంగా ఈ చిత్రం రూ. 206 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా వచ్చిన కలెక్షన్లలో రూ. 105 కోట్లకు పైగా లాభాలు దక్కాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు రూ. 100 కోట్ల బిజినెస్ జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X