Vikram Pre release business.. థియేట్రికల్ హక్కులు దక్కించుకొన్న యువ హీరో.. బిజినెస్ ఎంతంటే?

సినిమా ఇండస్ట్రీ లో హీరోలు కూడా ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. మరి కొందరు అయితే ఎప్పటి నుంచో సినిమా బిజినెస్ లో చాలా అనుభవం తో ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి అతికొద్ది మంది యువ హీరోలలో నితిన్ కూడా ఒకరు.. నితిన్ తండ్రి చాలా కాలంగా డిస్ట్రిబ్యూషన్ లో ఉంటూనే నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇక నితిన్ హీరోగా మారిన తర్వాత కొన్ని సినిమాలను వారి సొంత బ్యానర్లోనే నిర్మించడం జరుగింది. వీలైనంతవరకు ప్రాఫిట్స్ వచ్చే విధంగానే నిత్యం కూడా తన ప్రొడక్షన్ హౌస్ ను కొనసాగిస్తూ ఉన్నాడు.

ఇక అప్పుడప్పుడు తమిళ సినిమాలను కూడా తెలుగులో విడుదల చేస్తూ మంచి సక్సెస్ అయితే సొంతం చేసుకుంటున్నారు. ఇక నితిన్ రాబోయే కమలహాసన్ సినిమాను కూడా తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఖైదీ, మాస్టర్ సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

kamal haasan vikram telugu release by hero nithiin home production

ఇక ఈ సినిమా పై తమిళంలో అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి ఇక తెలుగులో కూడా ఓ వర్గం ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు టాలెంటెడ్ నటులు విజయ్ సేతుపతి అలాగే ఫాహాద్ ఫాజిల్ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. తప్పకుండా ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ విక్రమ్ సినిమాను ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో విడుదల చేస్తోంది.

ఇక ఈ సినిమాను దాదాపు తొమ్మిది కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. బాక్సాఫీస్ వద్ద 9.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల అవుతున్నట్లు సమాచారం. మరి సినిమా ఆ టార్గెట్ ను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. సినిమా ట్రైలర్ న్7 తెలుగులో రామ్ చరణ్ తేజ్ ద్వారా విడుదల చేయించడంతో మరింతగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక విక్రమ్ సినిమా జూన్ 3న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X