భలే హిట్టు కొట్టావు రాఘవ... లారెన్స్, హీరోయిన్‌కు రజనీ అభినందన.. బాక్సాఫీస్‌ను వణికిస్తున్న కాంచన3!
ప్రముఖ కొరియోగ్రాఫర్ లార్సెన్ రాఘవ నిర్మించి, దర్శకత్వం వహించిన కాంచన 3 చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నది. ఆదివారం నాటికి ఈ చిత్రం రూ.100 కోట్ల నికర వసూళ్లను సాధించింది. లారెన్స్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కాంచన 3 నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న నేపథ్యంలో హీరో లారెన్స్‌ను, హీరోయిన్ వేదికపై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళితే..

రెండో వారాంతంలోనూ నిలకడగా కాంచన 3
తమిళనాడులో కాంచన చిత్రం భారీ వసూళ్లను సాధించింది. అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా ధాటిని తట్టుకొని నిలకడగా కలెక్షన్లు రాబట్టింది. రెండో వారాంతంలో ఈ చిత్రం రూ.8.8 కోట్లు వసూలు చేయడం గమనార్హం. ఇప్పటికే ఈ చిత్రం లాభాల్లోకి చేరుకొందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కాంచన 3 దుమారం
తెలుగు రాష్ట్రాల్లో కాంచన 3 చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. జెర్సీ, అవెంజర్స్ చిత్రాలను తట్టుకొని థియేటర్లలో నిలబడింది. రెండో వారాంతానికి ఈ చిత్రం రూ.20 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చసింది. 2019లో అతిపెద్ద విజయం సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

భేష్ రాఘవ.. రజనీకాంత్ ప్రశంస
కాంచన 3 సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా సాధిస్తున్న నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను లారెన్స్ రాఘవ, హీరోయిన్ వేదిక కలిశారు. ఈ సందర్బంగా సినిమా సాధించిన విజయంపై ప్రశంసల వర్షం కురిపించారు. బ్రహ్మండమైన సక్సెస్ సాధించావంటూ ఇద్దరిని అభినందించారని సినీ వర్గాలు వెల్లడించాయి.

ముంబైలో రజనీకాంత్, లారెన్స్
ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్, లారెన్స్ రాఘవ ముంబైలో అడ్డా పెట్టారు. రజనీ దర్భార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న కీలక సన్నివేశాల చిత్రీకరణలో రజనీ, నయనతార, ప్రతీక్ బబ్బర్ పాల్గొంటున్నారు. అలాగే లారెన్స్ రాఘవ కాంచన సినిమా రీమేక్ లక్ష్మీబాంబ్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, కియారా అద్వానీ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











