Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నెగెటివ్ రివ్యూల్లోనూ... టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘కాంచన 3’ సంచలనం!
రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'కాంచన 3' మంచి విజయం సాధించింది. సినిమా విడుదలైన తొలిరోజే నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల పంట పండించింది. తెలుగు, తమిళంలో కలిపి రూ. 100 కోట్లకుపైగా వసూలు చేసి దుమ్మురేపింది.
తెలుగులో ఈ మూవీ రిలీజ్ హక్కులు ఠాగూర్ మధు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణలో 'ఎ' సెంటర్లలో పెద్దగా ఆడక పోయినా బి, సి సెంటర్లలో దమ్ము రేపింది. తాజాగా 4 వారాలు పూర్తి చేసుకుని బిజినెస్ ముగించుకున్న ఈ మూవీ ఠాగూర్ మధుకు మంచి లాభాలు తెచ్చిపెట్టిందట.
టాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అన్ని ఖర్చులు పోను ఠాగూర్ మధుకు రూ. 10 కోట్ల లాభం తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఫలితంతో రాఘవ లారెన్స్ సినిమా సత్తా ఏమిటో మరోసారి నిరూపించినట్లయింది.
'ముని' సిరీస్‌లో వచ్చిన 4వ చిత్రం 'కాంచన-3'... ఇటు తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి విజయం సాధించడంతో త్వరలో 'కాంచన-4' కూడా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ మొదలయ్యే అవకాశం ఉంది.
దక్షిణాదిన కాంచన సిరీస్ సూపర్ సక్సెస్ కావడంతో దీన్ని బాలీవుడ్‌లోకి తీసుకెళ్లాలని లారెన్స్ ప్లాన్ చేశారు. తన దర్శకత్వంలోనే అక్షయ్ కుమార్ హీరోగా 'కాంచన' చిత్రానికి రీమేక్‌గా హిందీలో 'లక్ష్మీ బాంబ్' అనే చిత్రం మొదలు పెట్టారు. రెండు రోజు క్రితం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ వచ్చిన రోజు సాయంత్రమే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు లారెన్స్ ప్రకటించడం సెన్సేషన్ అయింది.
తనకు తెలియకుండా ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో అవమానంగా ఫీలైన లారెన్స ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గౌరవం లేని చోట నేను పని చేయలేను అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. అక్షయ్ కుమార్ మీద గౌరవంతో తాను సినిమాను పాలనుకోవడం లేదని, తన కథను వాడుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.