Kanchana 4K Re Release Box Office: రీ రిలీజ్‌లో కాంచన వసూళ్ల జోరు.. లారెన్స్ మూవీకి ఎన్ని కోట్లంటే?

స్టార్ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ దర్శకుడిగానూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్, కామెడీ మూవీస్ ముని, కాంచన, కాంచన 2, కాంచన 3 చిత్రాలు ప్రేక్షకులను అలరించి భారీ వసూళ్లు సాధించాయి. వీటిలో కాంచనది సెపరేట్ ట్రెండ్. 15 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే భారీ టీఆర్పీలతో దుమ్మురేపుతుంది. ప్రస్తుతం రీ రిలీజ్‌ ట్రెండ్‌లో హిట్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తుండటంతో కాంచనను నేటి జనరేషన్‌కు తగినట్లుగా అత్యాధునిక 4కే, డాల్బీ వెర్షన్‌లో విడుదల చేశారు నిర్మాతలు. మరి కాంచన 4కే రీ రిలీజ్‌లో ఎన్ని కోట్లు రాబట్టింది? ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? అనేది పరిశీలిస్తే..

కాంచన తారాగణం:
శ్రీ థేనాందల్ ఫిల్మ్స్, రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాఘవ లారెన్స్, ఎన్ రాధలు సంయుక్తంగా ఈ కాంచన చిత్రాన్ని నిర్మించారు. లారెన్స్ సరసన లక్ష్మీరాయ్ హీరోయిన్‌గా నటించగా.. శరత్ కుమార్ కీలకపాత్ర పోషించారు. దేవన్ విలన్‌గా నటించారు. కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్, బాబు ఆంటోనీ, మనోబాల, మయిల్‌సామీ, మున్నార్ రమేశ్, సంపత్ రామ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. థమన్ సంగీత దర్శకత్వం వహించగా.. వెట్రీ పళనిసామి, కృష్ణసామిలు సినిమాటోగ్రాఫర్లుగా, కిషోర్ టీఈ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Kanchana 4K Re-Release Box Office Collections Worldwide Raghava Lawrence s film get good Number at GBOC

కాంచన బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి కాంచన మూవీకి 7 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. 2011 జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కాంచన మూవీ సంచలన విజయం సాధించింది. లారెన్స్ దర్శకత్వం, కామెడీ, హర్రర్ సన్నివేశాలతో పాటు థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. దాంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. లారెన్స్ ఓ వైపున భయపెడుతూనే.. తన మార్క్ కామెడీతో నవ్వించారు. తెలిసిపోయిందా అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది.

కాంచన వసూళ్లు ఎంత?
వసూళ్ల విషయానికి వస్తే.. తమిళనాడును మించి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిసింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్‌గా దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ దాదాపు 4 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకోగా.. ఆయనకు ఊహించని లాభాలు వచ్చాయి. ప్రస్తుతం రీ రిలీజ్‌ ట్రెండ్‌ తారాస్థాయిలో ఉండటంతో పాటు థియేటర్‌లలో సినిమాలు లేకపోవడంతో దీనిని క్యాష్ చేసుకునేందుకు కాంచన రంగంలోకి దిగింది. మార్చి 13న కాంచనను 4కే వెర్షన్‌లో రీ రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

రీ రిలీజ్‌లో కాంచన విధ్వంసం
కాంచన రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. లారెన్స్ పోషించిన కాంచన గెటప్ ధరించి థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేశారు ప్రేక్షకులు. ఒక రిలీజ్ సినిమా మాదిరిగా హంగామా నెలకొంది. బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కొత్త సినిమాలను మించిన రేంజ్‌లో కాంచనకు కలెక్షన్స్ నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కడపటి వివరాలు తెలిసేసరికి ఈ సినిమాకు బుక్ మై షోలో 38.66K టికెట్లు అమ్ముడయ్యాయి. గుంటూరు ఏరియాలో 13,93,656 లక్షల రూపాయల గ్రాస్ వసూలైనట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా తొలిరోజు కాంచన రీ రిలీజ్‌లో సంచలన వసూళ్లు రాబట్టింది. ఏకంగా 3.35 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. ఇది రీ రిలీజ్‌లో ఒక సంచలనంగా విశ్లేషకులు చెబుతున్నారు. మరి రీ రిలీజ్‌లో కాంచన ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X