twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Brahmastra కలెక్షన్లు ఫేక్.. సినిమా హిట్ అనే వాళ్లను జైల్లో పెట్టాలి.. కంగన, నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్

    |

    బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ తన సొంత బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్‌పై రూపొందించిన బ్రహ్మస్త్ర చిత్రం సాధిస్తున్న కలెక్షన్లపై బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సినిమా భారీ విజయం అందుకొన్నదని చేసిన ట్వీట్‌పై చెలరేగిపోయారు. తన వాట్సప్ స్టేటస్‌లో తీవ్ర స్థాయిలో కామెంట్ చేశారు. 5వ రోజు కలెక్షన్లను తప్పుపడుతూ బోగస్ కలెక్షన్లుగా అభివర్ణించారు. బ్రహ్మస్త్ర కలెక్షన్లు, కంగన రనౌత్ ట్వీట్ గురించి వివరాల్లోకి వెళితే..

    బ్రహ్మస్త్ర కలెక్షన్లపై కంగన

    బ్రహ్మస్త్ర కలెక్షన్లపై కంగన


    బ్రహ్మస్త్ర చిత్రం కలెక్షన్ల గురించి ఆంధ్రా బాక్సాఫీస్.కామ్ చేసిన ట్వీట్‌ను షేర్ చేసింది బ్రహ్మస్త్ర బిగ్ ఫ్లాప్. వర్కింగ్ డేస్‌లో సినిమా కలెక్షన్లు అంత గొప్పగా లేవు. 5 రోజుల్లో ఇండియాలో 168 కోట్ల గ్రాస్, 144 నికర వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లో 78 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 246 కోట్లు రాబట్టింది అని ట్వీట్ చేశారు.

    కంగన తన వాట్సప్ స్టేటస్ గురించి

    కంగన తన వాట్సప్ స్టేటస్ గురించి


    అయితే బ్రహ్మస్త్ర చిత్రం 650 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమా బడ్జెట్‌లో 38 శాతం రికవరీ మాత్రమే సాధించింది. ఈ సినిమా ఫెయిల్యూర్ దిశగా అడుగులేస్తున్నది అని ఆంధ్రా బాక్సాఫీస్.కామ్ చెప్పింది. ఆ ట్వీట్‌ను షేర్ చేస్తూ.. ఈ సినిమా 144 కోట్లు సాధిస్తే ఈ సినిమాను హిట్ అంటున్నారు. మూవీ మాఫియా ఆగడాలను మాత్రమే బహిర్గతం చేయడానికి నేను ఈ ట్వీట్‌ను సాక్ష్యంగా చూపించాను. ఈ సినిమా బడ్జెట్‌తో పోలిస్తే.. వసూలు చేసింది చాలా తక్కువ. కానీ హిట్ అని ప్రచారం చేసుకొంటున్నారని అని కామెంట్ చేసింది.

    జీనియస్ అంటే జైల్లో పెట్టాలి

    జీనియస్ అంటే జైల్లో పెట్టాలి


    గతవారం ఆయన్ ముఖర్జీ టాలెంట్‌ను శంకిస్తూ కంగన రనౌత్ ట్వీట్ చేసింది. అబద్దాలను ప్రచారం చేస్తూ సినిమాను అమ్ముకొంటున్నారు. ఆలియాభట్, రణ్‌బీర్, ఆయాన్ ముఖర్జీ జీనియస్ అని కరణ్ జోహర్ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. జీవితంలో ఓ మంచి సినిమా తీయలేని వ్యక్తి 600 కోట్లతో సినిమా ఎలా తీస్తాడు. ఇలాంటి వారసుల వల్ల ఎన్ని స్టూడియోలు మూతపడాలి. ఆయన్ ముఖర్జీని జీనియస్ అనే వారిని జైల్లో పెట్టాలి అని కంగన రనౌత్ సెటైర్ వేసింది.

    ప్రపంచ బ్యాంక్ రుణం కోసం


    ఇదిలా ఉండగా, బ్రహ్మస్త్ర సినిమా కలెక్షన్లు ఫేక్ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తూ ట్విట్టర్‌లో ట్రోల్ చేస్తున్నారు. బ్రహ్మస్త సినిమా కలెక్షన్లతో కరణ్ జోహర్ ప్రపంచంలోనే కుబేరుడు అయ్యాడు. ఈ సినిమా ట్రిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో కరణ్ జోహర్‌ను లోన్లు ఇవ్వమని వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు వెంటపడుతున్నాయి అని ట్రోల్ చేశారు.

    బ్రహ్మస్త్ర బాయ్ కాట్ సక్సెస్

    బ్రహ్మస్త్ర బాక్సాఫీస్ రిపోర్టు చూస్తుంటే.. పెయిడ్ ట్వీట్లతో చెలరేగిపోతున్నారు మీడియా పనిచేయడం లేదనిపిస్తున్నది. బాయ్ కాట్ బ్రహ్మస్త్ర విజయవంతమైంది. హిందువులకు ధన్యవాదాలు. ఇక విక్రమ్ వేద, పఠాన్ సినిమాల సంగతి చూద్దాం అని నెటిజన్ కామెంట్ చేశాడు.

    English summary
    Kangana Ranaut wrote on her whatsapp status that, The film has been declared the biggest hit at mere ₹144 crore (cost 650 cr) this is only to put in perspective how movie mafia works.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X