బాక్సాఫీస్‌పై కత్తి దూసిన మణికర్ణిక.. 100 కోట్ల క్లబ్‌పై కంగన దాడి!
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ నటించిన మణికర్ణిక చిత్రం వివాదాల నడుమ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నది. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ల జోరును కనసాగిస్తున్నది. స్వాతంత్ర్య సమర నారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఈ చిత్రం ఆదివారానికే రూ.46 కోట్లను వసూలు చేసింది. వివరాల్లోకి వెళితే..

మణికర్ణికలో కంగనపై ప్రశంసలు
మణికర్ణిక చిత్రంలో కంగన రనౌత్ నటనపై పలు వర్గాల నుంచి ప్రశంసలు వెల్లవెత్తుతుండటం, మౌత్ టాక్ కూడా పాజిటివ్‌గా ఉండటంతో కలెక్షన్లు జోరందుకొన్నాయి. ఆదివారం ఈ చిత్రం రూ.20 కోట్లు వసూలు చేసింది. భారీ చిత్రాలకు ధీటుగా ఈ సినిమా వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లు
ఓవర్సీస్‌లో మణికర్ణిక చిత్రం ఒక మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. గురువారం 1.17 లక్షల డాలర్లు, శుక్రవారం 4.38 లక్షల డాలర్లు, శనివారం 5.16 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో సుమారు 4 లక్షల డాలర్లు, యూఏఈలో 3.5 లక్షల డాలర్లు వసూలు చేయడం విశేషం.

దేశీయంగా రూ.50 కోట్లు
దేశీయంగా కూడా మణికర్ణిక చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. శుక్రవారం 8.75 కోట్లు, శనివారం రూ.18.10 కోట్లు, ఆదివారం రూ.20 కోట్లు వసూలు చేసింది. భారత్‌లోనే చిత్రం రూ.50 కోట్లకు చేరువైంది. వారాంతం తర్వాత కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

రూ.100 కోట్లకు చేరువలో
మణికర్ణిక వసూళ్ల వేగం బాక్సాఫీస్ వద్ద ఇదే విధంగా కొనసాగితే త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఈ చిత్రానికి తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత కంగనా రనౌత్ దర్శకత్వం బాధ్యతలు చేపట్టింది. డైరెక్టర్ టైటిల్ వివాదం ఇప్పుడు క్రిష్, కంగన మధ్య రాజుకొంటుంది.


Click it and Unblock the Notifications











