Tejas Collections కంగన రనౌత్ మూవీ హిట్టా? ఫట్టా? షాకింగ్‌గా తేజస్ కలెక్షన్లు!
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, అన్షుల్ చౌహాన్, ఆశీష్ విద్యార్థి నటించిన తేజస్ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. సర్వేష్ మేవరా దర్శకత్వంలో, రోన్ని స్కూవాలా నిర్మించిన ఈ చిత్రంపై టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని రేపాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందిన తేజస్ అక్టోబర్ 27 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే విషయంలో వెళితే..
తేజస్ సినిమా కథ విషయానికి వస్తే.. టెర్రిరిస్టుల నుంచి ప్రయాణికులను కాపాడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తేజస్ గిల్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఉగ్రవాదుల చేతిలో చిక్కిన ప్రయాణికులను విడిపించడానికి ఆమె చేసిన వీరోచిత, సాహసోపేతమైన సంఘటనను వెండితెర మీద భావోద్వేంగా మలిచారు.

తేజస్ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే.. ఎయిర్‌ఫోర్స్ అకాడమీతోపాటు క్వాలిటీకి రాజీ లేకుండా భారీగా ఖర్చు చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ మొత్తంగా 45 కోట్ల రూపాయలు అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 50 కోట్లుగా జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 55 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. ఇక ఈ సినిమాపై అంచనాలు ఉండటంతో 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
కంగన రనౌత్ నటించిన తేజస్ సినిమా విడుదలైన తర్వాత ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదనే విషయం స్పష్టమవుతున్నది. ఈ సినిమాపై టాక్ మిక్స్‌డ్‌గా వినిపిస్తున్నది. దాంతో ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా చోట్ల పేలవంగా బుకింగ్స్ కనిపించాయి. ఉత్తరాదిలో దారుణంగా ఆక్యుపెన్సీ కనిపించింది. ఓవరాల్‌గా మొదటి రోజు 10 శాతం మించి ఆక్యుపెన్సీ నమోదు కాకపోవడంతో సినిమా తొలి రోజు కలెక్షన్లు షాకింగ్‌గా నమోదు అయ్యాయి.

ఇక తేజస్ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ సినిమా 75 లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశం కనిపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1.5 కోట్ల రూపాయలు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కంగన రనౌత్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో ఆమె నటించిన చిత్రాలన్నీ దాదాపుగా బోల్తా కోడుతున్నాయి. ధాకడ్ చిత్రం తొలి రోజు 50 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఆమె నటించిన సినిమాలు ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయాయి. చివరకు తేజస్ సినిమా ఆమెను ఫ్లాప్స్ నుంచి గట్టెక్కిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











