Kanguva Box Office Report: కంగువ రిలీజ్‌కు ముందే ధనుష్ రికార్డు బ్రేక్.. మొత్తం ఎన్ని కోట్లంటే?
ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువ. తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన ఈ సినిమాను కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ తదిరలు నటించారు. ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ క్రమంలో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన లభిస్తున్నది. బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కంగువ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన లభించడంతో ఓవర్సీస్‌లో చాలా రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించగా మంచి రెస్సాన్స్ లభించింది. తాజాగా ఈ సినిమా ప్రీ సేల్స్ బుకింగ్‌ను కేరళ, తమిళనాడు, ఆంధ్రా, కర్ణాటకలో ప్రారంభించగా రికార్డు లెవెల్ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి.

కంగువ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు తమిళనాడులో భారీగా రెస్పాన్స్ వస్తున్నది. తొలి రోజునే ఈ సినిమా 1.20 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక కేరళలో ఊహించని రెస్పాన్స్ వస్తున్నది. తొలి రోజే రికార్డులు బ్రేక్ చేసే పనిలో కనిపించింది. మొదటి రోజే ధనుష్ నటించిన రాయన్ సినిమా వసూళ్లను అధిగమించి ఈ సినిమా 50 లక్షల రూపాయల కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఇక హిందీ వెర్షన్ 10 లక్షల రూపాయలు రాబట్టింది.
కంగువ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆదరణ భారీగానే కనిపిస్తున్నది. హైదరాబాద్‌లో ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో అడ్వాన్స్ బుకింగ్‌కు స్పందన లభిస్తున్నది. ఆంధ్రా, నైజాంలో కలిపి ఈ సినిమా మొదటి రోజే 1 కోటి రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇంకా రెండు రోజుల వ్యవధి ఉన్నందున ఈ సినిమా భారీగా కలెక్షన్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఓవర్సీస్‌లో సూర్య సినిమాకు అనూహ్యమైన రెస్పాన్స్ లభిస్తున్నది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 200K కలెక్షన్లను రాబట్టింది. ఇక మిగితా దేశాల్లో కలెక్షన్లు కలిపితే మొత్తంగా 600K డాలర్లు అంటే.. సుమారుగా 5 కోట్లకుపైగా రూపాయలను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక గల్ఫ్‌లో ఈ సినిమా 100K డాలర్లు రాబట్టిందని తెలిపారు.
ఇక కంగువ అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన వస్తుండటంతో ట్రేడ్ వర్గాల అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా తొలి రోజున ప్రీమియర్లు, అడ్వాన్స్ బుకింగ్ అంతా కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 50 కోట్ల రూపాయలు మేర వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాపై నిర్మాతలు అంచనాలు ఊహకు అందని విధంగా ఉండటంతో సూర్య అభిమానుల్లో ఉత్సాహం రెండింతలయ్యింది.


Click it and Unblock the Notifications











