Kanguva Day 1 Box Office Report : విజయ్‌ని కొట్టలేకపోయిన సూర్య .. కంగువా ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

సిరుత్తై శివ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా కంగువాను నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలి రోజు ఎలాంటి వసూళ్లు రాబట్టిందో చూస్తే.

పిరియాడికల్ మూవీగా రూపొందిన కంగువ సినిమాను అద్బుతమైన లోకేషన్లలో తెరకెక్కించారు. అలాగే బాలీవుడ్ స్టార్లు బాబీ డియోల్, దిశా పటానీ సహా ఇండస్ట్రీలో టాప్ టెక్నిషియన్స్‌తో సినిమాను రూపొందించారు. దాంతో ఈ మూవీ బడ్జెట్ 350 కోట్ల రూపాయలు మేర అయింది. దీనికి ప్రమోషన్స్ ఖర్చులు రూ.50 కోట్లు అదనంగా చేరాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Kanguva Day 1 Box Office Collections report Worldwide

ఇక కంగువ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ మూవీ తమిళనాడు హక్కులు 80 కోట్ల రూపాయలు, తెలుగు హక్కులు 25 కోట్ల రూపాయలు, కర్ణాటక హక్కులు 10 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 10 కోట్లు, హిందీ, ఇతర భాషల్లో 25 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 40 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 190 కోట్ల రూపాయల మేర జరిగింది.

దీంతో కంగువాకు రూ. 195 కోట్ల షేర్, 390 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను నిర్దేశించారు. టీజర్, ట్రైలర్ సహా పోస్టర్లతో సూర్య మూవీపై భారీ హైప్ రావడంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా జరిగాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే దాదాపు రూ. 15 కోట్ల మేర వసూళ్లు దక్కాయి.

Kanguva Day 1 Box Office Collections report Worldwide

ఇక తొలి రోజు కంగువా ఓపెనింగ్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇండియాలో రూ. 22 కోట్లు రాబట్టగా.. ఇందులో తమిళనాడు నుంచి రూ. 13.65 కోట్లు, హిందీలో రూ. 3.25 కోట్లు, కర్ణాటకలో రూ. 2 లక్షలు, కేరళలో రూ. 8 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్లు చొప్పున వసూళ్లు రాబట్టింది.

అయితే ఈ ఏడాది విడుదలైన తమిళ చిత్రాల్లో ఓపెనింగ్స్ విషయంలో ఇళయ దళపతి విజయ్ నెంబర్ వన్ ప్లేస్‌ను మిగిలిన కోలీవుడ్ స్టార్స్ కొట్టలేకపోతున్నారు. విజయ్ ది గోట్ మూవీ తొలి రోజున రూ. 52 కోట్ల గ్రాస్ సాధించి లిస్ట్‌లో నెంబర్‌వన్‌గా నిలిచింది. తర్వాత వెట్టయన్ రూ.37 కోట్లు, ఇండియన్ 2 రూ. 30.25 కోట్లు, అమరన్ రూ. 24.70 కోట్లతో సూర్య కంటే ముందున్నాయి. శుక్రవారం నుంచి వీకెండ్ కావడంతో కంగువా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.

More from Filmibeat

Read more about: kanguva suriya bobby deol
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X