Kanguva Day 1 Collections: కంగువ రికార్డు ఓపెనింగ్స్.. సూర్య మూవీకి ఎన్ని కోట్లంటే?
తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన కంగువ మూవీ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. బాలీవుడ్ తారలు బాబీ డియోల్, దిశ పటానీ, కార్తీ (గెస్ట్ అప్పీయరెన్స్) తదితరులు నటించిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్ చిత్రంగా ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. నవంబర్ 14వ తేదీన భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
డిఫరెంట్ జానర్‌లో పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన కంగువ సినిమాను అద్బుతమైన లోకేషన్లలో తెరకెక్కించారు. అలాగే బాలీవుడ్ టాప్ యాక్టర్లు, ఇండస్ట్రీలో టాప్ టెక్నిషియన్స్‌తో సినిమాను రూపొందించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు మేర అయింది. అలాగే ప్రమోషన్స్ ఖర్చులు మరో 50 కోట్ల రూపాయలు మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక కంగువ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ మూవీ తమిళనాడు హక్కులు 80 కోట్ల రూపాయలు, తెలుగు హక్కులు 25 కోట్ల రూపాయలు, కర్ణాటక హక్కులు 10 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 10 కోట్లు, హిందీ, ఇతర భాషల్లో 25 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 40 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 190 కోట్ల రూపాయల మేర జరిగింది.
ఇక సూర్య సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సమారుగా 195 కోట్ల షేర్, 390 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించింది. ఈ సినిమాపై క్రేజ్ ఎక్కువగా ఉండటంతో సుమారుగా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాపై బజ్ ఎక్కువగా క్రియేట్ కావడంతో అడ్వాన్స్ ఓపెనింగ్స్ కూడా రికార్డు లెవెల్స్‌లో నమోదు అయ్యాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సుమారుగా 15 కోట్ల మేర కలెక్షన్లు సాధించాయి.

ఇక ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబడుతున్నది. ఈ సినిమా మొదటి రోజు 15 కోట్ల గ్రాస్ వసూళ్లు నమో్దు చేస్తుందని అంచనా వేశఆరు. ఇక ఏపీ, తెలంగాణలో సుమారుగా 10 కోట్ల రూపాయలు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 60 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేస్తుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











