Kanguva Day 2 Box Office Report : ఇండస్ట్రీ ఊహించని వసూళ్లు .. రెండో రోజు కంగువాకు ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక విశేషం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. అంతలా తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటారు సూర్య. తాజాగా
సిరుత్తై శివ దర్శకత్వంలో ఆయన నటించిన కంగువా బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టి సూర్య స్టామినా ఏంటో చూపించింది. మరి రెండో రోజు కంగువా ఎలాంటి వసూళ్లు సాధించిందో చూస్తే :
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా కంగువాను నిర్మించారు. పీరియాడికల్ మూవీగా రూపొందిన ఈ సినిమాను దేశ విదేశాల్లోని అద్బుతమైన లోకేషన్లలో తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్లు బాబీ డియోల్, దిశా పటానీ సహా ఇండస్ట్రీలో టాప్ టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. దాంతో ఈ మూవీ బడ్జెట్ 350 కోట్ల రూపాయలు మేర అయింది. దీనికి ప్రమోషన్స్ ఖర్చులు రూ.50 కోట్లు అదనంగా చేరాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

టీజర్ , ట్రైలర్, సూర్య గెటప్స్‌తో భారీ హైప్ తెచ్చుకున్న కంగువ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. తమిళనాడు హక్కులు 80 కోట్ల రూపాయలు, తెలుగు హక్కులు 25 కోట్ల రూపాయలు, కర్ణాటక హక్కులు 10 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 10 కోట్లు, హిందీ, ఇతర భాషల్లో 25 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 40 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 190 కోట్ల రూపాయల మేర జరిగింది.
దీంతో కంగువాకు రూ. 195 కోట్ల షేర్, 390 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను నిర్దేశించారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా జరిగాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే దాదాపు రూ. 15 కోట్ల మేర వసూళ్లు దక్కాయి. ఇక ఇక తొలి రోజు కంగువా ఓపెనింగ్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా రూ. 40.20 కోట్లకు పైగా రాబట్టింది. అయితే ఈ ఏడాది విడుదలైన తమిళ చిత్రాల్లో ఓపెనింగ్స్ విషయంలో ఇళయ దళపతి విజయ్ నెంబర్ వన్ ప్లేస్‌ను కంగువా టచ్ చేయలేకపోయింది. విజయ్ ది గోట్ మూవీ తొలి రోజున రూ. 52 కోట్ల గ్రాస్ సాధించి లిస్ట్‌లో నెంబర్‌వన్‌గా నిలిచింది.

ఇక రెండో రోజు కంగువా ఎన్ని కోట్లు సాధించిందో చూస్తే .. బుకింగ్స్ దాదాపు 60 శాతం మేర డ్రాప్ అయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. తమిళనాడులోనూ వసూళ్లు భారీగా పడిపోయాయి. రెండో రోజు తమిళనాడులో రూ. 3.50 కోట్లు, హిందీలో రూ. 2.86 కోట్లు, తెలుగులో రూ. 2.29 కోట్లు, కన్నడలో రూ. 4 లక్షలు, మలయాళంలో రూ. 3 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్ల చొప్పున మొత్తంగా రూ. 15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. శని, ఆదివారాలు కంగువా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుంది అన్న దానిపై సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది.


Click it and Unblock the Notifications











