Kanguva Day 2 Collections: ట్రోల్స్, నెగిటివిటీని ఎదురించిన కంగువ.. సూర్య మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే
కంగువ చిత్రం మిక్స్‌డ్ టాక్, ట్రోలింగ్స్ వెంటాడుతున్నప్పటికీ.. తొలి రోజు రికార్డు వసూళ్లు నమోదు చేసింది. అయితే నెగిటివ్ టాక్ భారీగా ఉన్న ఈ సినిమాకు తొలి రోజు ప్రేక్షకులు పోటెత్తారు. సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్ నటించిన ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్ చిత్రంగా ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ తారలు బాబీ డియోల్, దిశా పటానీ నటించారు. ఈ సినిమా రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
డిఫరెంట్ జానర్‌లో పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన కంగువ సినిమాను అద్బుతమైన లోకేషన్లలో తెరకెక్కించారు. అలాగే బాలీవుడ్ టాప్ యాక్టర్లు, ఇండస్ట్రీలో టాప్ టెక్నిషియన్స్‌తో సినిమాను రూపొందించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు మేర అయింది. అలాగే ప్రమోషన్స్ ఖర్చులు మరో 50 కోట్ల రూపాయలు మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక కంగువ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ మూవీ తమిళనాడు హక్కులు 80 కోట్ల రూపాయలు, తెలుగు హక్కులు 25 కోట్ల రూపాయలు, కర్ణాటక హక్కులు 10 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 10 కోట్లు, హిందీ, ఇతర భాషల్లో 25 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 40 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 190 కోట్ల రూపాయల మేర జరిగింది.
ఓవర్సీస్‌లో ప్రీమియర్లకు, తొలి రోజు కంగువ సినిమాకు మంచి ఆదరణ లభించింది. శ్రీలంకలో రికార్డులు క్రియేట్ చేస్తుంది. నార్త్ అమెరికాలో 400K, ఆస్ట్రేలియా, గల్ఫ్, మలేషియా, యూకే తదితర దేశాల్లో భారీ వసూళ్లు రాబట్టింది. యూకే ప్రీమియర్ల ద్వారా 40 వేల పౌండ్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో తొలి రోజు, ప్రీమియర్ల ద్వారా 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పలుదేశాల్లో బాక్సాఫీస్ వద్ద సూర్య క్రేజ్ కనిపించింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కంగువ బాక్సాఫీస్ వద్ద సానుకూలత లభించింది. ఈ సినిమా వెట్టియాన్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్స్ సినిమాల కంటే ఎక్కువగా వసూళ్లను సాధించింది. నైజాంలో 2 కోట్ల రూపాయలు, సీడెడ్, ఆంధ్రాలో కలిపి 3.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమా సుమారుగా 5.5 కోట్ల రూపాయలు రాబట్టింది.

తమిళనాడులో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా తొలి రోజు 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కేరళలో 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కన్నడలో ఈ సినిమా 4 కోట్ల రూపాయలు, తెలుగులో 5.5 కోట్ల రూపాయలు, హిందీలో 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో 24 కోట్ల రూపాయలు నికరంగా రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 58.9 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇదిలా ఉండగా, రెండో రోజు కూడా కంగువ భారీగానే బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపుతున్నది. ఈ సినిమా రెండో రోజు ఇండియాలో 6 నుంచి 7 కోట్ల రూపాయలు రాబడుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 20 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











