Kanguva Day 3 Box Office Report : ఆ ఎఫెక్ట్ గట్టిగానే .. కంగువాకు మూడో రోజు ఎన్ని కోట్లంటే?

కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా రజనీకాంత్ వెట్టయన్ కోసం వాయిదా పడింది.
సిరుత్తై శివ దర్శకత్వం వహించిన కంగువా చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కంగువా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. మరి మూడో రోజు కంగువా ఎలాంటి వసూళ్లు సాధించిందో చూస్తే :

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా కంగువాను నిర్మించారు. క్రీస్తు శకం 1000 - 1100 శతాబ్ధాల మధ్య జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా పీరియాడికల్ మూవీగా రూపొందించారు. ఈ సినిమాను దేశ విదేశాల్లో మునుపెన్నడూ చూడని అద్బుతమైన లోకేషన్లలో తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్లు బాబీ డియోల్, దిశా పటానీ సహా టాప్ టెక్నిషియన్స్‌ కంగువా కోసం పనిచేశారు. దాంతో ఈ మూవీ బడ్జెట్ 350 కోట్ల రూపాయలు మేర అయింది. దీనికి ప్రమోషన్స్ ఖర్చులు రూ.50 కోట్లు అదనంగా చేరాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Kanguva Day 3 Box Office Collections report Worldwide

ముందు నుంచే భారీ హైప్ తెచ్చుకున్న కంగువా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడ్డారు. తమిళనాడు హక్కులు 80 కోట్ల రూపాయలు, తెలుగు హక్కులు 25 కోట్ల రూపాయలు, కర్ణాటక హక్కులు 10 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 10 కోట్లు, హిందీ, ఇతర భాషల్లో 25 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 40 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. మొత్తంగా కంగువా ప్రీ రిలీజ్ బిజినెస్ 190 కోట్ల రూపాయల మేర జరిగింది. దీంతో సూర్య మూవీకి రూ. 195 కోట్ల షేర్, 390 కోట్ల గ్రాస్‌ను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు.

భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కంగువా రెండ్రోజుల్లో రూ.60 కోట్లకు పైగా గ్రాస్‌ను రూ. 30 కోట్ల షేర్‌ను రాబట్టింది. తమిళనాడులో రూ. 18 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 9 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 4.65 కోట్లు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియాలలో రూ. 10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16 కోట్ల చొప్పున కలెక్షన్స్ సాధించింది. కంగువా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా దాదాపు రూ. 150 కోట్ల వరకు వసూళ్లు సాధించాల్సి ఉంది.

Kanguva Day 3 Box Office Collections report Worldwide

మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న కంగువాకు శుక్రవారం నుంచే వసూళ్లు డల్ అయ్యాయి. ఫస్ట్ షో, సెకండ్ షోలలో బుకింగ్స్ భారీగా జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో కంగువాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లలో మేజర్ షేర్ ఈ ఏరియాల నుంచి వచ్చినదే. ఇక మూడో రోజు కంగువా ఎన్ని కోట్లు సాధించిందో చూస్తే .. తమిళనాడులో రూ. 6.50 కోట్లు, హిందీలో రూ. 2.33 కోట్లు, తెలుగులో రూ. 2.08 కోట్లు, కన్నడలో రూ. 4 లక్షలు, మలయాళంలో రూ. 3 లక్షలు , ఓవర్సీస్‌లో రూ. 4 కోట్లు చొప్పున మొత్తంగా రూ. 15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆదివారంతో వీకెండ్ ముగియనుండటంతో ఈ సినిమా లాంగ్ రన్‌లో ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: kanguva suriya bobby deol
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X