Kanguva Day 3 Collections: 100 కోట్లకు చేరువగా కంగువ.. నెగిటివ్ టాక్‌లో సూర్యకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
కంగువ చిత్రం మిక్స్‌డ్ టాక్, నెగిటివిటీ ఎలా ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం అంచనాలను మించి కలెక్షన్లు రాబట్టలేకపోయతున్నదనేది వాస్తవంగా కనిపిస్తున్నది. సిరుతై శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్ నటించిన ఈ సినిమా క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడంతో కొంత కలెక్షన్లపై ప్రభావం పడినట్టు కనిపిస్తున్నది. ఈ సినిమా 3 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
చరిత్రలో 1070 సంవత్సరంలో జరిగిన సంఘటనల ఆధారంగా పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో కంగువ సినిమాను అందమైన లోకేషన్లలో తెరకెక్కించారు. అలాగే బాలీవుడ్ టాప్ యాక్టర్లు, ఇండస్ట్రీలో టాప్ టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు కలుపుకొని సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు మేర అయింది. అలాగే ప్రమోషన్స్ ఖర్చులు మరో 50 కోట్ల రూపాయలు మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక కంగువ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ మూవీ తమిళనాడు హక్కులు 80 కోట్ల రూపాయలు, తెలుగు హక్కులు 25 కోట్ల రూపాయలు, కర్ణాటక హక్కులు 10 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 10 కోట్లు, హిందీ, ఇతర భాషల్లో 25 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 40 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 190 కోట్ల రూపాయల మేర జరిగింది.
కంగువ తమిళనాడు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా తొలి రోజు 15 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు రాబట్టింది. మలయాళంలో ఈ సినిమా తొలి రోజు 4 కోట్లు, రెండో రోజు 2 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక కన్నడలో ఈ సినిమా ఫస్ట్ డే 2.5 కోట్లు, రెండో రోజు 1 కోటి రూపాయలు వసూలు చేసింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల విషయానికి వస్తే.. హిందీ, తెలుగు సినిమా రంగంలో సూర్యకు హయ్యెస్ట్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఆంధ్రా, నైజాం తొలి రోజు 6 కోట్ల రూపాయలు, రెండో రోజు 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీలో తొలి రోజు 4 కోట్ల రూపాయలు, రెండో రోజు 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
గత రెండు రోజుల్లో కంగువ చిత్రం ఇండియా వైడ్ 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో 18 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 61 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం శనివారం హాలీడే కావడంతో కొంత మెరుగైన వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 3వ రోజు ఇండియాలో 7 కోట్లకుపైగా ఓవర్సీస్‌లో 3 కోట్లకుపైగా వసూళ్లను రాబడుతుంది. ఈ సినిమా 3వ రోజు 10 నుంచి 12 కోట్ల మధ్య వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని తెలిపారు. దాంతో ఈ సినిమా 65 కోట్ల రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











