Kanguva Day 4 Box Office Report : నెగిటివ్ టాక్‌కు ఎదురొడ్డిన సూర్య .. కంగువాకు ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య, బాబీ డియోల్, దిశా పటానీ నటించిన లేటెస్ట్ మూవీ కంగువా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా నెగిటివ్ పబ్లిసిటీ, టాక్‌ను ఎదుర్కొంటూ బాక్సాఫీస్ వద్ద నిలబడే ప్రయత్నం చేస్తోంది. తొలి వీకెండ్‌ను పూర్తి చేసుకున్న కంగువా ఎన్ని కోట్లు రాబట్టింది? 4వ రోజు ఏయే ఏరియాల్లో ఎన్ని కలెక్షన్లు రాబట్టిందో ఒకసారి చూస్తే.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా కంగువాను నిర్మించారు. క్రీస్తు శకం 1000 - 1100 శతాబ్ధాల మధ్య జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా పీరియాడికల్ మూవీగా రూపొందించారు. భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ చూడని అద్బుతమైన లోకేషన్లలో కంగువాను తెరకెక్కించారు. ఇండస్ట్రీలోని టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రం కోసం పనిచేశారు. కంగువా మూవీ బడ్జెట్ 350 కోట్ల రూపాయలు మేర అయింది. దీనికి ప్రమోషన్స్ ఖర్చులు రూ.50 కోట్లు అదనంగా చేరాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కంగువా టీజర్, ట్రైలర్ సూర్య గెటప్ కారణంగా ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడ్డారు. తమిళనాడు హక్కులు 80 కోట్ల రూపాయలు, తెలుగు హక్కులు 25 కోట్ల రూపాయలు, కర్ణాటక హక్కులు 10 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 10 కోట్లు, హిందీ, ఇతర భాషల్లో 25 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 40 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. మొత్తంగా కంగువా ప్రీ రిలీజ్ బిజినెస్ 190 కోట్ల రూపాయల మేర జరిగింది. దీంతో సూర్య మూవీకి రూ. 195 కోట్ల షేర్, 390 కోట్ల గ్రాస్‌ను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 6000 స్క్రీన్లలో కంగువాను రిలీజ్ చేశారు. ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 127.64 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ అఫీషియల్‌గా పోస్టర్ రిలీజ్ చేసింది. కంగువాపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, కావాలనే సినిమాను తొక్కేయాలని చూస్తున్నారని హీరో సూర్య సతీమణి జ్యోతిక ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి అర్ధగంట సినిమా బాలేదని.. కానీ మిగిలిన రెండున్నర గంటల గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదని ఆమె తెలిపారు.

మరోవైపు కంగువా కలెక్షన్లపైనే సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 127 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా స్టూడియో గ్రీన్ పోస్టర్ వేయడంతో అది నిజం కాదని ఈ సినిమా తొలి మూడు రోజుల్లో కేవలం రూ. 65 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగో రోజు కంగువా వసూళ్ల విషయానికి వస్తే .. తమిళనాడులో రూ. 6.35 కోట్లు, హిందీలో రూ.2.72 కోట్లు, తెలుగులో రూ.2.29 కోట్లు, కన్నడలో రూ. 3 లక్షలు, మలయాళంలో రూ. 2 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 60 లక్షల చొప్పున మొత్తంగా రూ. 13 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ ప్రారంభం కానుండటంతో కంగువా ఏ రేంజ్‌లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











