Kanguva Day 5 collections: పడిపోతున్న కంగువా వసూళ్లు..5వ రోజు సూర్య మూవీకి ఎన్ని కోట్లంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ నటులు బాబీ డియోల్, దిశా పటానీ నటించిన లేటెస్ట్ మూవీ కంగువా బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నెగిటివ్ టాక్ దెబ్బతీస్తోంది. స్వయంగా హీరో సూర్య భార్య జ్యోతిక ఈ దుష్ప్రచారాన్ని బయటపెట్టడంతో కోలీవుడ్ ఉలిక్కిపడింది. నెగిటివ్ పబ్లిసిటీని ఎదుర్కొంటూనే బాక్సాఫీస్ వద్ద నిలబడే ప్రయత్నం చేస్తోంది కంగువా. ఈ నేపథ్యంలో 5వ రోజు సూర్య మూవీ ఏయే ఏరియాల్లో ఎన్ని కలెక్షన్లు రాబట్టిందో ఒకసారి చూస్తే.

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా కంగువాను నిర్మించారు. క్రీస్తు శకం 1000 - 1100 శతాబ్ధాల మధ్య జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా పీరియాడికల్ మూవీగా రూపొందించారు. భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ చూడని అద్బుతమైన లోకేషన్లలో కంగువాను తెరకెక్కించారు. ఇండస్ట్రీలోని టాప్ టెక్నిషియన్స్‌ ఈ చిత్రం కోసం పనిచేశారు. కంగువా మూవీ బడ్జెట్ 350 కోట్ల రూపాయలు మేర అయింది. దీనికి ప్రమోషన్స్ ఖర్చులు రూ.50 కోట్లు అదనంగా చేరాయని కోలీవుడ్ టాక్.

Kanguva Day 5 Box Office Collections report Worldwide

కంగువా టీజర్, ట్రైలర్ , ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తమిళనాడు హక్కులు 80 కోట్ల రూపాయలు, తెలుగు హక్కులు 25 కోట్ల రూపాయలు, కర్ణాటక హక్కులు 10 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 10 కోట్లు, హిందీ, ఇతర భాషల్లో 25 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 40 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. మొత్తంగా కంగువా ప్రీ రిలీజ్ బిజినెస్ 190 కోట్ల రూపాయల మేర జరిగింది. దీంతో సూర్య మూవీకి రూ. 195 కోట్ల షేర్, 390 కోట్ల గ్రాస్‌ను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు.

ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 6000 స్క్రీన్లలో కంగువాను రిలీజ్ చేయగా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 83.45 కోట్ల గ్రాస్ .. రూ.40.10 కోట్ల షేర్‌ను రాబట్టింది. తమిళనాడులో రూ. 26.45 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.45 కోట్లు, కర్ణాటకలో రూ. 4.30 కోట్లు, కేరళలో రూ. 5.80 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 12.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 21.65 కోట్ల చొప్పున కలెక్షన్స్ సాధించింది. కంగువా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా దాదాపు రూ. 140 కోట్లు రావాల్సి ఉంది.

Kanguva Day 5 Box Office Collections report Worldwide

తమిళనాడు తర్వాత సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది . ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కంగువా వసూళ్లు చూస్తే.. నైజాంలో రూ. 2.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.04 కోట్లు, ఆంధ్రలో రూ. 3.28 కోట్ల చొప్పన మొత్తంగా నాలుగు రోజుల్లో రూ. 7.27 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక ఐదో రోజు సూర్య మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే తమిళనాడులో రూ. 1.87 లక్షలు, హిందీలో రూ. 96 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.33 లక్షలు, కన్నడంలో రూ. 2 లక్షలు, మలయాళంలో రూ. 2 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 32 లక్షల చొప్పున మొత్తంగా రూ.4.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో తొలి వీకెండ్ ముగిసే నాటికి కంగువా ఎన్ని కోట్లు రాబడుతుందోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: kanguva suriya bobby deol
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X